టీడీపీ ఎస్సీ నేతల నిరవధిక దీక్ష భగ్నం

ABN , First Publish Date - 2022-08-19T08:37:36+05:30 IST

అంబేడ్కర్‌ విదేశీవిద్యను మూడేళ్లుగా మరుగునపడేసి తాజాగా జగనన్న విదేశీవిద్యగా పేరును మార్చడాన్ని నిరసిస్తూ టీడీపీ...

టీడీపీ ఎస్సీ నేతల నిరవధిక దీక్ష భగ్నం

  • అర్ధరాత్రి తర్వాత బలవంతంగా గుంటూరుకు తరలింపు
  • చికిత్స నిరాకరించి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న నేతలు 

మంగళగిరి, ఆగస్టు 18: అంబేడ్కర్‌ విదేశీవిద్యను మూడేళ్లుగా మరుగునపడేసి తాజాగా జగనన్న విదేశీవిద్యగా పేరును మార్చడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండు రోజులుగా సాగుతున్న దళిత నాయకుల నిరవధిక దీక్షలను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. దీక్షలు చేస్తున్న 11 మందిని బలవంతంగా అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి భారీగా పోలీసులు మంగళగిరికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత వందలాదిమంది పోలీసులు శిబిరం వద్దకు రాగా, వారిని నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని కూడా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లో పడవేశారు. టీడీపీ ఎస్సీ నాయకులు వేమూరి మైనర్‌బాబు, కనికళ్ల చిరంజీవి, కొప్పుల మధు, పడవల మహేష్‌, కంభంపాటి శిరీష, మాణిక్యమ్మ, అనూష, బేతపూడి సుధాకర్‌, ఎర్రగుంట్ల భాగ్యారావు తదితరులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సకు నిరాకరించి దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్షలను పోలీసులు బలవంతంగా భగ్నం చేసిన తీరును పలు ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. 

Updated Date - 2022-08-19T08:37:36+05:30 IST