75th Independence Day: గూగుల్ డూడుల్‌లో స్వాతంత్ర్య సంబరాలు!

ABN , First Publish Date - 2021-08-15T12:50:16+05:30 IST

దేశంలో ఈరోజు 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు...

75th Independence Day: గూగుల్ డూడుల్‌లో స్వాతంత్ర్య సంబరాలు!

న్యూఢిల్లీ: దేశంలో ఈరోజు 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివర్ణపతాకాల రెపరెపలు అడుగడుగునా కనిపిస్తూ, దేశభక్తిని గుర్తుచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గూగుల్ కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక డూడుల్ రూపొందించింది. 


దేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న నృత్య రీతులు ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా గూగుల్... ‘1947లో ఇదే రోజు అర్థరాత్ర వేళ భారత్‌కు స్వాతంత్యం వచ్చింది. దీంతో బ్రిటీష్ బానిస పాలన నుంచి దేశానికి విముక్తి లభించింది. స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇటువంటి సందర్భంలో గూగుల్ డూడుల్‌ను కోల్‌కతాకు చెందిన సాయన్ ముఖర్జీ రూపొందించారని తెలియజేసింది.

Updated Date - 2021-08-15T12:50:16+05:30 IST