Independence day celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T17:12:05+05:30 IST

నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Independence day celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

హైదరాబాద్: నగరంలోని బీజేపీ (BBJP) రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ (Independence day ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి (Inderasena reddy), విజయశాంతి (vijayashanti), పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti sudhakar reddy), సంకినేని (Sankineni) తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.


స్వాతంత్య్రం కోసం గాంధీ దేశ భక్తితో ప్రజలను ఏ విధంగా ముందుకి తీసుకెళ్లారో ప్రధాని మోదీ (PM Modi) కూడా ఈరోజు ప్రజల్లో అదే విధమైన స్ఫూర్తి నింపారని ఇంద్రసేనారెడ్డి అన్నారు. గత 4 నాలుగు రోజులుగా ఏ ఇంటిపై చూసిన తిరంగ జెండా (National flag) కనిపిస్తుందని తెలిపారు. ప్రపంచములోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని అన్నారు. మోదీ (Narendra modi) నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని.. కరోనా (Corona)సమయంలో 90 దేశాలకు కరోనా వాక్సిన్ సరఫరా చేసామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబరు 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఒక సంవత్సరము పాటు స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలన్నారు. ఎంఐఎంకు భయపడి కేసీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని కొరతామని తెలిపారు. ఒక సంవత్సరం పాటూ.. వేడుకలు నిర్వహించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఇంద్రసేనా రెడ్డి పిలుపునిచ్చారు. 


పొంగులేటి సుధాకర రెడ్డి మాట్లాడుతూ... మోదీ ఎర్రకోట(Redfort) మీద చేసిన ప్రసంగం చాలా గొప్పగా ఉందన్నారు.  కుటుంబ, అవినీతి పాలనను చరమ గీతం పడాలని పిలుపునిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పరిపాలన చేస్తోందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు. శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud) అనే మంత్రి ఆట వస్తువులా గన్ పేల్చారని... అసలు మన సంస్కృతి ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. కుటుంబ పాలన దించేందుకు బండి సంజయ్ (Bandi sanjay) ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని అడుగుల్లో అడుగు వేస్తూ.. ముందుకి వెళ్దామని పిలుపునిచ్చారు. మరొక్క 20 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా (Make in India)తో అగ్రరాజ్యంగా ఉంటామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 


సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...  విదేశీ శక్తుల నుంచి దేశాన్ని కాపాడటం, ప్రపంచ దేశాలకు భారత్‌ (India)ను దిక్సూచిగా మలచి మోదీ దేశాన్ని ముందుకి తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య  వ్యతిరేక పాలన నడుస్తోందని... అందుకే  చట్టాన్ని చేతిలోకి మంత్రి  శ్రీనివాస్ గౌడ్ (Telangana minister) గన్ పేల్చారని మండిపడ్డారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు. తెలంగాణకు బంగారు పునాదులు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తెలిపారు. 


విజయశాంతి మాట్లాడుతూ... ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తోందన్నారు. ప్రధాని మోదీ (Modi) పిలుపుతో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టారని అన్నారు. ప్రజలంతా మోదీ పిలుపును అల్టిమేటంగా పాటించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనాతో అనేక దేశాలు అతలాకుతలం అయ్యాయి కానీ కరోనా సమయంలో సమర్థవంతంగా దేశాన్ని ముందుకి నడిపిన వ్యక్తి మోదీ అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో దేశం నంబర్ వన్‌గా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు విజయశాంతి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-15T17:12:05+05:30 IST