Independence day: వాషింగ్టన్ డీసీలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

ABN , First Publish Date - 2022-08-16T02:23:57+05:30 IST

వాషింగ్టన్ డీసీలో భారత 75వ స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు

Independence day: వాషింగ్టన్ డీసీలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

వాషింగ్టన్ డీసీలో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు సాయి సుధ పాలడుగు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాలను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ అన్షుల్ శర్మ(ఇండియన్ ఎంబసీ), GWTCS ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-16T02:23:57+05:30 IST