త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-16T07:24:49+05:30 IST

స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీవీ జ్యోతిర్మయి జాతీయ జెండాను ఎగురువేశారు.

త్రివర్ణ శోభితం
దివాన్‌చెరువు: నన్నయ వర్శిటీలో విద్యార్థుల ప్రదర్శన

  • ఘనంగా 76వ స్వాతంత్య్ర వేడుకలు
  • అధికారులు, ప్రజాప్రతినిధుల పతాకావిష్కరణ 
  • స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 15: స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీవీ జ్యోతిర్మయి జాతీయ జెండాను ఎగురువేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. లాలాచెరువు 42 బెటాలియన్‌  సీఆర్‌పిఎఫ్‌ కార్యాలయంలో కమాండెంట్‌ సతీష్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. సెకండ్‌ కమాండెంట్‌ చంతిల్‌కుమార్‌, డిప్యూటి కమాండెంట్‌ రత్నమ్మ, జగదీష్‌ సింగ్‌ షెకావత్‌, జవాన్లు పాల్గొన్నారు. సెంట్రల్‌ జైలులో సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు జెండా ఎగురవేసారు. లాలాచెరువు-క్వారీ రోడ్డులో జనసేన సిటీ ఇన్‌చార్జ్‌ అనుశ్రీ సత్యనారాయణ విచ్చేసి జెండా ఆవిష్కరించారు. గుండుబెల్లి దుర్గాప్రసాద్‌, గుళ్ళా సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. కృష్ణనగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బోడా వెంకట్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్‌, మహాత్మగాంధీ చిత్రపటాలకు నివాళులర్పించారు. కూనపరెడ్డి శ్రీనివాస్‌, బత్తిన చంద్రరావు, బాలాజీ శర్మ పాల్గొన్నారు. సిటిఆర్‌ఐ రోడ్డులో శ్రీగాయిత్రి స్కూలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్‌ దీపక్‌ పాల్గొన్నారు. రైల్వే చీఫ్‌ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌, కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు కేశవభట్ల శ్రీనివాసరావు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోని వెయింట్‌ హాలులో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. 100 మంది రక్తదానం చేశారు. స్టేషన్‌లోని వెండర్స్‌, పోర్టర్స్‌, సపాయివాలాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దీనికి ఆర్పీఎఫ్‌ సీఐ సైదయ్య విచ్చేశారు. స్టేషన్‌ మేనేజరు గంగాప్రసాద్‌, రైల్వే మజ్ధూర్‌ యూనియన్‌ కార్యదర్శి ధర్మాల శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌ సభ్యు లు, రైల్వే టీటీలు, ధన్వంతరి బ్లడ్‌ బ్యాంక్‌ డాక్టర్‌ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. శ్రీరామ్‌నగర్‌లో ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు  ఎగురవేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు నోటు బుక్స్‌, స్వీట్లును పంపిణీ చేసారు. కార్యక్రమంలో కాశి నవీన్‌కుమార్‌, రాచపల్లి ప్రసాద్‌, యిన్నమూరి రాంబాబు, సింహ నాగమణి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విద్యానగర్‌ వాకర్స్‌ స్కేటింగ్‌ పార్కులో చిన్నారులు జాతీయ జెండాలను పట్టుకుని స్కేటింగ్‌ చెయ్యడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated Date - 2022-08-16T07:24:49+05:30 IST