మురిసిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2022-08-16T05:41:40+05:30 IST

కళాశాలలు, పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

మురిసిన మువ్వన్నెల జెండా
పాలకోడేరు పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన

జిల్లాలో జాతీయ పతాకావిష్కరణలు..

భారీ పతాకంతో ర్యాలీలు..

స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళి


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: భీమవరం కోర్టు ఆవరణలో  3వ అదనపు జిల్లా జడ్డి పి.శ్రీసత్యాదేవి, ఎస్‌ఈబీ కార్యాలయంలో ఏఎస్పీ ఎటీవీ రవికుమార్‌, ప్రభుత్వాసుపత్రిలో డీసీహెచ్‌ఎస్‌ ఎం.వీరాస్వామి జాతీయ జెండా ఆవిష్కరిం చారు. భీమవరం పట్టణంలోని కళాశాలలు, పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని టీడీపీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, వైసీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ప్రకాశం చౌక్‌, చెన్నరంగనిపాలెంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం జిల్లా కార్యాల యంలో జిల్లా కార్యదర్శి బి.బలరాం, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద అద్దంకి దొరబాబు, అల్లూరి సీతారామరాజు సేవాసమితి ఆధ్వర్యంలో గాదిరాజు సుబ్బరాజు జాతీయ జెండాలు ఆవిష్కరించారు.


ఆకివీడు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీపీ కఠారి జయలక్ష్మి, జడ్పీటీసీ యండగండి శ్రీను, తహసీల్దార్‌ నీలాపు గురుమూర్తిరెడ్డి, ఎంపీడీవో శ్రీకర్‌, నగర పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరించారు. ఉండి తహసీల్దారు కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ఇందుకూరి హరిబాబు జెండా ఎగురవేశారు. సహకార బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మత్స్య పరిశోధన కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు దివంగత కాంగ్రెస్‌ సుబ్బన్న భార్య శ్యామలమ్మను సన్మానించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నీరజ, శాస్త్రవేత్తలు, ఆక్వా రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. యండగండి శివాలయం ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సంబరాలు నిర్వహించారు.


కాళ్ళ ఎంపీడీవో ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు జెండా ఆవిష్కరించారు. జడ్పీటీసీ సభ్యుడు పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, ఎంపీ డీవో స్వాతి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. కలవపూడిలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పాల్గొన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఏవీ కృష్ణారావు జెండా ఎగురవేశారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, మున్సిపాలిటీ వద్ద చైర్‌పర్సన్‌ బర్రి వెంకటరమణ, ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ, సబ్‌ డివిజన్‌ పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీ వీరాం జనేయరెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఫాజిల్‌, రూరల్‌ స్టేషన్‌ వద్ద ఎస్సై ప్రియకుమార్‌, టౌన్‌ స్టేషన్‌ వద్ద ఎస్సై సుధాకర్‌ రెడ్డి జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. లేస్‌ పార్క్‌, రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద పతాకాలు ఆవిష్కరించారు. పాలకొల్లు పట్టణం, మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మున్సిపల్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణ, రూరల్‌ పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల వద్ద జాతీయ పతాకాలను అవిష్కరించారు.


యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీలో జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ పా ల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ రావూరి వెంకటర మణ, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్ధారు ఎల్‌.నర్శింహరావు, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ జేవీఎన్‌. ప్రసాద్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్క రించారు. ఆచంట మండలంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ దిగమర్తి సూర్యకు మారి ఆవిష్కరించారు. జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, వైస్‌ ఎంపీపీ తాళం శ్రీనివాస్‌, యర్రగొప్పుల నాగరాజు పాల్గొన్నారు. పంచాయతీల వద్ద సర్పంచ్‌లు, జాతీయ జెండాలు ఆవిష్కరించారు. పెనుగొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణంరాజు, తహసీ ల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నండూరి వెంకటేశ్వరరావు, పోలీసు స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌ జాతీయ పతాకాలు ఆవిష్కరిం చారు. పంచాయతీ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కార్మిక సంఘాలు, వాసవి శాంతి ధామ్‌ వద్ద పతాకాలు ఎగరవేశారు. పాలకోడేరు మండలం మోగల్లు జడ్పీ హైస్కూల్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడారు. పాలకోడేరులో స్వాతంత్య్ర సమరయోధుడు దెందుకూరి వెంకట సుబ్బరాజు సతీమణి వెంకటసుబ్బమ్మ ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఆమెను సత్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు, ఎంపీడీవో మురళీగంగాధరరావు, రెవెన్యూ కార్యాయంలో తహసీల్దారు ఎస్‌కె.హుస్సేన్‌ జెండా ఎగురవేశారు.


వీరవాసరం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, విద్యా సంస్థలతో పాటు టీడీపీ, జనసేన, వైసీపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. వడ్డిగూడెం అమృత్‌ సరోవర్‌ వద్ద, నవుడూరు జంక్షన్‌లోని నేషనల్‌ ఫ్లాగ్‌టవర్‌ వద్ద వేడుకలు నిర్వహించారు. అధికారులు ఎం. సుందరరాజు, పి.శామ్యూల్‌, ఎస్‌ఐ సి.రమేష్‌, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జడ్పీటీసీ గుండా జయప్రకాష్‌నాయుడు, సర్పంచ్‌లు, ఎంపీ టీసీ సభ్యులు పాల్గొన్నారు. పోడూరు మండలం కవిటం పరకాల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో  భారత నావికాదళ విశ్రాంత ఉన్నతాధికారి కమొడోర్‌ పరకాల సుధీర్‌ పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సబ్బితి సుమంగళి, కొమ్ముచిక్కాలలో జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు జాతీయ పతాకాలను ఆవిష్కరిం చారు. పెనుమదంలో పీఎంపీ వైద్యుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనం వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మాజీ ఆర్మీ అధికార్లను సన్మానిం చారు. తణుకు పట్టణం, మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జి.సృజన, సాల్వేషన్‌ ఆర్మీ పీస్‌ ఆఫ్‌ హోమ్‌ నందు వావిలాల సరళాదేవి జెండా ఆవిష్కరిం చారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తాడేపల్లిగూడెం పట్టణంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో 300 మీటర్ల జెండాతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ పొనుకుమాటి శేషులత, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనా రాయణ క్యాంపు కార్యాలయం వద్ద కొట్టు విశాల్‌ జెండా ఎగరవేశారు. పంచాయతతీలు, సొసైటీల వద్ద జెండా ఎగరేశారు. కొత్తూరులో అమృత పథకంలో భాగంగా తవ్విన చెరువు వద్ద ఉపాది కూలీలతో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2022-08-16T05:41:40+05:30 IST