మువ్వన్నెల రెపరెపలు

Published: Tue, 16 Aug 2022 02:19:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మువ్వన్నెల రెపరెపలు

  • అందరికీ సంక్షేమ ఫలాలు : స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీదిరి
  • 1.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.86.78కోట్ల సాయం 
  • 2లక్షల72వేల119మందికి ప్రతినెలా రూ.69కోట్ల పింఛన్లు 
  • రూ.374కోట్లతో జిల్లాలోని 1,331 పాఠశాలల్లో అన్ని వసతులు 
  • లక్షా42వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు 
  • రూ.100 కోట్ల నిధులతో ఐదు ప్రధాన రహదార్ల విస్తరణ 
  • కాకినాడ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
  • జిల్లావ్యాప్తంగా ఎగిరిన త్రివర్ణ పతాకాలు

కాకినాడ సిటీ, ఆగస్టు 15: జిల్లా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, ప్రజా సంక్షేమం, సత్వర అభివృద్ధి లక్ష్యంగా నవరత్నా ల ప్రాధాన్య పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం కాకినాడలోని పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు నిర్వహించిన సంప్రదాయ సమ్మాన్‌ గార్డ్‌ ఆనర్‌, మార్చ్‌ఫాస్ట్‌ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలు, పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలను అందించిన మహనీయుల స్ఫూర్తి మార్గాన్ని ముందు తరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలివే.. 

మంత్రి అప్పలరాజు ప్రసంగిస్తూ ప్రజలకు పరిపాలనను మరింత చేరువలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా నూతన కాకినాడ జిల్లా ఏర్పాటైందని, ప్రజా సంక్షేమం, సత్వరాభివృదిఽఽ్ధ లక్ష్యాలుగా వివిధ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధిలో భా గంగా, వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఈ ఏడాది తొలి విడతగా 1.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.86.78కోట్లు ఆర్థిక సహాయం అందించామన్నా రు. మత్స్యకార భరోసా పథకం ద్వారా చేపలవేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన 21,394 మత్స్యకార కుటుంబాలకు ఈ ఏడాది ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.21కోట్ల39 లక్షలు ఆర్థిక సహాయం అందించామన్నారు. పింఛన్‌ కానుక పథకం ద్వారా జిల్లాలో 2లక్షల72వేల119మంది లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పిస్తూ ప్రతినెల రూ.69కోట్ల మొత్తాన్ని వివిధ కేటగిరీల పింఛన్లుగా అందిస్తున్నామని తెలిపారు. మన బడి-నాడు నేడు కార్యక్రమం తొలిదశ ద్వారా రూ.374కోట్లతో జిల్లాలోని 1,331 పాఠశాలలను అన్ని వసతులతో అభివృద్ధి చేశామని, రెండో దశలో రూ.390కోట్లతో మరో 941 పాఠశాలల్లో 2,038 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో జిల్లాలో అర్హులైన లక్షా42వేల పేదకుటుంబాలకు ఇళ్లస్థలాలు మంజూరు చేసి దశలవారీగా అందరికీ గృహాలు కల్పిస్తున్నామన్నారు. 

రైతులకు అండగా మద్ధతు ధర..

గత రబీ సీజనులో రైతులు పండించిన ధాన్యానికి మద్ధతు ధర అందించేం దుకు జిల్లావ్యాప్తంగా ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసిన 337 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 27,672మంది రైతులనుంచి రూ.528కోట్ల విలువైన 2.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో రూ.340కోట్లతో 14,675 పనులు చేపట్టామన్నారు.  సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ పథకం కింద రూ.100కోట్ల నిధులతో ఐదు ప్రధాన రహదారులో ఐదు కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టామన్నారు. జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాలో పరిశ్రమలకు రూ.11.23కోట్ల విలువైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందించగా అందులో ఎస్టీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.6.78కోట్ల మేర లబ్ధి పొందారన్నారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జేసీ ఇలాక్కియ, కాకినాడ రూరల్‌, సిటీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ ద్వారంపూడి భాస్కరరెడ్డి, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, కాకినాడ మేయర్‌ సుంకర శివప్రసన్న, కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.రమేష్‌, కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

పోర్టుసిటీ(కాకినాడ), ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కాకినాడ పరేడ్‌ గ్రౌండ్‌లో వివిధశాఖల శకటాల ప్రదర్శన ఆకట్టు కుంది. అన్నవరం దేవస్థానం, వ్యవసాయం, ఆరోగ్యశ్రీ, జిల్లా పరిషత్‌, గ్రా మ, వార్డు సచివాలయాలు, పౌరసరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విద్యాశాఖ, గృహ నిర్మాణం, కాకినాడ స్మార్ట్‌ సిటీ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక తదితర శాఖల శకటాలను ప్రదర్శిం చారు. వీటిలో జిల్లా విద్యాశాఖ శకటానికి ప్రథమస్థానం, జిల్లా గ్రామీణ నీటిసరఫరా సంస్థ శకటానికి ద్వితీయస్థానం, కాకినాడస్మార్ట్‌ సిటీ, హౌసిం గ్‌ శాఖలకు సంయుక్తంగా తృతీయస్థానాలతోపాటు ప్రోత్సాహక బహుమతి గా వ్యవసాయశాఖ శకటానికి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రశంసాపత్రాలు అందజేశారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తొలుత పరదేశంపేట మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులకు ప్రథమ బహుమతి, కాకినాడ చర్చ్‌స్క్వేర్‌ మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠ శాలకు ద్వితీయ బహుమతి, జగన్నాథపురం సెయింట్‌ ఆన్స్‌ బాలికల ఉన్న త పాఠశాల విద్యార్థులకు తృతీయ బహుమతి, ప్రత్యేక ప్రోత్సాహక బహు మతిగా ఉమామనోవికాస కేంద్రం విభిన్న ప్రతిభావంతులకు ప్రశంసాప త్రాలు జ్ఞాపికలు అందజేశారు. వ్యాఖ్యాతగా కృష్ణమూర్తి వ్యవహరించారు. 

జిల్లా ఆర్మ్‌డ్‌ రీజర్వ్‌ పోలీస్‌ బృందానికి ప్రథమస్థానం, కాకినాడ సాంబ మూర్తినగర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలకు ద్వితీయ స్థానం, 3ఏ బాలికల బెటాలియన్‌ ఎన్‌సీసీ-ఆర్మీకి తృతీయ స్థానాల్లో బహు మతులు అందుకున్నారు.

స్టాల్స్‌ విభాగంలో మత్స్యశాఖ ప్రథమస్థానం, ఐసీడీఎస్‌ ద్వితీయ స్థానం, ఉద్యానశాఖ తృతీయస్థానాల్లో బహుమతులు దక్కించుకున్నాయి.

ప్రభుత్వప్రాధాన్యత భవనాల ఉత్తమ మండలాలు: గొల్లప్రోలు ప్రఽథమ, శంఖవరం ద్వితీయ, కాకినాడ గ్రామీణం తృతీయ స్థానాలు దక్కాయి.

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఉత్తమ మండలాలు: కాకినాడ గ్రామీణం ప్రథమ, తాళ్లరేవు ద్వితీయ, పెద్దాపురం తృతీయ స్థానాలు సాధించి ప్రశంసా పత్రాలను అందుకున్నాయి.

ఉత్తమ సేవలకు అవార్డులు

అధికారులకు ప్రశంసా పత్రాలు ప్రదానం

పోర్టుసిటీ(కాకినాడ), ఆగస్టు 15: జిల్లాలోని ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు ముఖ్యఅతిథులు అందజేశారు. అవార్డు అందుకున్నవారిలో 8మంది జిల్లా అధికారులు డ్వా మా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, హౌసింగ్‌ పీడీ బి.సు ధాకర్‌ పట్నాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌, అగ్నిమాపక అధికారి బి.ఏసుబాబు, ఎక్సైస్‌ అధికారి ఎస్‌.కె.డి.వి.ప్రసాద్‌, ఆర్‌డీవో బి.వి.ర మణ, డిస్ర్టిక్ట్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి కె.ప్రవీణ అవార్డులు అం దుకున్నారు. రెవెన్యూ, పోలీసు, ఇతరశాఖల్లో ఉత్తమ సేవలందించిన కాకి నాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌, నగరపాలకసంస్థ హెల్త్‌ ఆఫీ సర్‌ పృథ్వీచరణ్‌, కాకినాడ అర్భన్‌ తహసీల్దార్‌ వైఎస్‌హెచ్‌ సతీష్‌, జీజీ హెచ్‌ సూపరింటెండెంట్‌ పి.వెంకటబుద్ద, కలెక్టరేట్‌ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్‌ ఐపీ శెట్టి, కలెక్టరేట్‌ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.శివ రామకృష్ణ, కలెక్టరేట్‌ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టరేట్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌  వీఏ స్వరూప్‌, కలెక్టరేట్‌ కా ర్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ జీఎన్‌వీ రవి తేజ, కలెక్టరేట్‌ కార్యాలయం పీఎంయూ టీం డిస్ర్టిక్‌ కో-ఆర్డినేటర్‌ ఓ.పాపరాజు, ఆర్డీవో కార్యాలయ తహ సీల్దార్‌ జి.వరహలయ్య, వికాస పీడీ కె.లచ్చారావు, కాకినాడ డీఎస్పీ వి.భీ మారావు, కాకినాడ అడ్మిన్‌ ఎస్పీ (ఏఆర్‌) బి.సత్యనారాయణ, కాకినాడ టూ టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ డీఎస్‌ చైతన్య కృష్ణ, పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, కాకినాడ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌ జాన్సన్‌, జగ్గంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ పి.విజయలక్ష్మి, జగ్గంపేట తహసీల్దార్‌ బి.శ్రీదేవి, పిఠాపురం డిప్యూటీ తహ సీల్దార్‌ ఎన్‌.సత్యనారాయణ, ఏలేశ్వరం తహసీల్దార్‌ ఏవీ శాస్ర్తి, గండేపల్లి డిప్యూటీ తహసీల్దార్‌ ఇ.సరిత తదితరులు ఇన్‌చార్జి మంత్రి అప్పలరాజు, కలెక్టర్‌ కృతికాశుక్లా నుంచి అవార్డులు అందుకున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో..

కాకినాడ క్రైం, ఆగస్టు 15: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు. ఆర్మ్‌ రిజర్వు పోలీస్‌ సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, కార్యక్రమానికి హాజరైన అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ(అడ్మిన్‌) పి.శ్రీనివాస్‌, ఏఎస్పీ(ఏఆర్‌) బి.సత్యనారాయణ, ఎస్‌బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలు పి.మురళీకృష్ణారెడ్డి, బి.అప్పారావు తదితర ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీఎస్పీలో...

సర్పవరం: ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలిత మే స్వాతంత్య్ర దినోత్సవమని, నేటి యువతరానికి వీరి త్యాగాలను తెలియజేయాల్సిన బాధ్య త మనందరిపైనా ఉందని కమాండెంట్‌, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. సోమవారం ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో నిర్వహించిన స్వాతం త్య్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ సీహెచ్‌ భద్రయ్య, అడిషనల్‌ డీసీపీ ఎల్‌.అర్జున్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర వేడుకలు

కాకినాడ సిటీ, ఆగస్టు 15: కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్‌ కృతికాశుక్లా, జేసీ ఎస్‌.ఇలాక్కియ, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి పూలమాలలు, నూలు దండ వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కలెక్టరేట్‌ను జాతీయజెండాలు, విద్యుత్‌ దీపాల కాంతులతో ఆకర్షణీయంగా తయారు చేశారు. 

జిల్లాస్థాయి అధికారులకు హైటీ తేనీటి విందు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి కలెక్టర్‌ కృతికా శుక్లా జిల్లాస్థాయి అధికారులకు హై టీ తేనీటి విందు ఇచ్చారు. ఈ ఆత్మీ య కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జేసీ ఇలాక్కియ, పోలవరం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌ ఆదిత్య, ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌ భరణి, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ, పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.