స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-09T05:39:08+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టర్లు పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, ఎస్‌.మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 8: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టర్లు పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, ఎస్‌.మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీన వరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 9వ తేదీన జాతీయ జెండాల పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జిల్లాలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాలకు రంగులు వేసి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జిల్లాలోని సినిమా థియేటర్లలో 6వ తరగతి నుంచి 10వ తగరతి విద్యార్థులకు మహాత్మాగాంధీ సినిమా చూపించాలన్నారు. జిల్లాలోని అటవీ భూములు, ఖాళీ ప్రదేశాల్లో 75ఏళ్లు గుర్తుచేసేలా మొక్కలు నాటాలన్నారు. ఈ నెల 11న పోలీస్‌, యువజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఫ్రీడమ్‌రన్‌ నిర్వహించాలన్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ముగ్గులు, క్రీడల పోటీల నిర్వాహ ణ, మునిసిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్‌, గ్రామపంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో 75ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాల లోగో తప్పక ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శకటాలు, స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, వెంకారెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు, డీఎ్‌సవో విజయలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఈఈ యాకుబ్‌, డీహెచ్‌వో శ్రీధర్‌, డీఏవో రామారావునాయక్‌, డీపీవో యాదయ్య, డీఆర్‌డీవో సుందరి కిరణ్‌కుమార్‌, సంక్షేమాధికారులు శంకర్‌, దయానందరాణి, అనసూర్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:39:08+05:30 IST