మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-16T05:52:53+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్స వాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.

మువ్వన్నెల జెండా రెపరెపలు

 ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవం
హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు


ఏలూరురూరల్‌, ఆగస్టు 15: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్స వాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్వో సత్యనారాయణమూర్తి, ఏవో రమాదేవి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బీ.రవి, తదితరులు పాల్గొన్నారు. డీఐజీ కార్యాలయంలో డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. డీఐజీ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావాలను మనమంతా స్మరించు కోవాలన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ జెండాను ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, పలు విభాగాల పోలీసులు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కోర్టులో వేడుకలను నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ.పురు షోత్తమకుమార్‌ పిలుపునిచ్చారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాస రావు, న్యాయమూర్తులు, హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి, ఏలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శశిధర్‌ రెడ్డి, సెక్రటరీ చింతమనేని రమేష్‌, న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ జెం డాను ఆవిష్కరించారు. అనంతరం కారుణ్య నియామకం ద్వారా ఎంపికైన ఇద్దరు దిగువ శ్రేణి సహాయకులు, ఒక టైపిస్టు, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేటర్లకు నియామకపు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌, ఏవోలు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో..


తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 15: మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పంద్రాగస్టు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్‌ టీ. జానకీరామ్‌ త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. ఏపీ నిట్‌ ప్రాంగణంలో నిట్‌ డీన్‌ రీసెర్చ్‌ కన్సల్టెన్సీ డాక్టర్‌ జీ. రవికిరణ్‌శాస్త్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యో గులకు అవార్డులు అందించారు. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T05:52:53+05:30 IST