
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. రబడ, జాన్సెన్ బౌలింగ్ దెబ్బకు టపటపా వికెట్లు రాల్చుకున్న భారత జట్టు 223 పరుగులకు ఆలౌట్ అయింది. కోహ్లీ (79), పుజారా (43) మినహా సఫారీ బౌలర్లను ఎవరూ ఎదురొడ్డలేకపోయారు.
పంత్ (27) కాసేపు కుదురుకుని అభిమానుల్లో ఆశలు పుట్టించినప్పటికీ క్రీజులో పాతుకుపోవడంలో విఫలమయ్యాడు. రహానే (9) ఎప్పటిలానే ఉసూరుమనించగా, కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15), శార్దూల్ ఠాకూర్ (12) వంటి వారు కూడా ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయారు. ఫలితంగా 223 పరుగులకే ఆటగాళ్లు మొత్తం పెవిలియన్ చేరారు. సఫారీ బౌలర్లలో రబడ నాలుగు వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఒలివియర్, లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజ్‌కు చెరో వికెట్ దక్కింది.
ఇవి కూడా చదవండి