సూపర్ శక్తిగా భారత్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Published: Fri, 01 Apr 2022 20:17:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సూపర్ శక్తిగా భారత్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్: భారతదేశం ప్రపంచంలోనే సూపర్ శక్తిగా ఎదుగుతోందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న "జాతీయ సంస్కృతీ  మహోత్సవం"లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కాపాడటమే జాతీయ సంస్కృతి మహోత్సవం ఉద్దేశమన్నారు. సంస్కృతి, సంప్రదాయలను అనుభవించి భావి తరాలకు అందించాలన్నారు. సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలకు ప్రోత్సాహం ఇవ్వడం సంతోషమన్నారు. ప్రభుత్వ వ్యవహారాలు మాతృభాషలోనే జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు. భారతీయ భాషలు, యాసలను కాపాడటంలో కేంద్ర ప్రయత్నం అభినందనీయమన్నారు. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆయన కోరారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను ఉప రాష్ట్రపతి తెలిపారు. హైదరాబాద్ వేదికగా మూడు రోజుల పాటు జాతీయ సంస్కృతీ మహోత్సవం జరుగనుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.