అతిపెద్ద మిలిటరీ శక్తిగా భారత్‌: మోదీ

ABN , First Publish Date - 2021-10-17T08:55:02+05:30 IST

భారత రక్షణ రంగానికి గతంలో ఎన్నడూ లేనంతగా పారదర్శకత, విశ్వాసం, సాంకేతికత ఆధార విధానం కల్పించామని ప్రధాని మోదీ చెప్పారు. స్వాతంత్ర్యానంతరం స్తంభించిన విధానాలపై తొలిసారిగా భారీ సంస్కరణలు చేపట్టామన్నారు.

అతిపెద్ద మిలిటరీ శక్తిగా భారత్‌: మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 16: భారత రక్షణ రంగానికి గతంలో ఎన్నడూ లేనంతగా పారదర్శకత, విశ్వాసం, సాంకేతికత ఆధార విధానం కల్పించామని ప్రధాని మోదీ చెప్పారు. స్వాతంత్ర్యానంతరం స్తంభించిన విధానాలపై తొలిసారిగా భారీ సంస్కరణలు చేపట్టామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 7 రక్షణ రంగ కంపెనీలను ప్రధాని శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భం గా సెల్ఫ్‌ రిలయంట్‌ ఇండియా కార్యక్రమం గురించి ప్రధాని మాట్లాడుతూ భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ శక్తిగా తయారు చేయడమే లక్ష్యమన్నారు. 200 ఏళ్ల నాటి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎ్‌ఫబీ)ను రద్దు చేసిన తర్వాత ఈ 7 ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీలను ఏర్పాటు చేశారు. పునర్నిర్మాణమనేది నిరంతర ప్రక్రియ అని, అది ఈ ఒక్కదానితోనే ఆగిపోదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. 



Updated Date - 2021-10-17T08:55:02+05:30 IST