6 నెలలు కాదు ఇకపై 9 నెలల పాటు.. టీకా వృథాను అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం..?

ABN , First Publish Date - 2021-03-30T23:31:35+05:30 IST

టీకా వృథాను అరికట్టేందుకు కేంద్రం ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

6 నెలలు కాదు ఇకపై 9 నెలల పాటు.. టీకా వృథాను అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం..?

న్యూఢిల్లీ: టీకా వృథాను అరికట్టేందుకు కేంద్రం ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా టీకాల షెల్ఫ్ లైఫ్‌ను ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకూ పొడిగించిదని అంతర్జాతీయ వార్త సంస్థ తాజాగా వెల్లడించింది. గతంలో కరోనా టీకాలను అవి తయారైన తారుఖు మొదలు ఆరు నెలలోపే వినియోగించాల్సి వచ్చేది. అయితే..షెల్ఫ్ లైఫ్‌లో మార్పుతో ఇకపై టీకా తయారైనా నాటి నుంచి తొమ్మిది నెలలలోపు వినియోగించే అవకాశం ఉంది. సీఐఐ తయారు చేసి ఎగుమతి చేస్తున్న వ్యాక్సిన్లకు ఇది వర్తించనుందని సమాచారం. దీని వల్ల టీకాలు వృథాను నిరోధించేందుకు వివిధ దేశాల అధికారులకు అవకాశం కలుగుతుందట. 


టీకా షెల్ఫ్ లైఫ్‌ను పొడిగించని పక్షంలో ఆఫ్రికా దేశాలు వచ్చే నెల 15 నాటికి తమ వద్ద ఉన్న పదిలక్షలకు పైగా టీకా డోసులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అది కుదరకపోతే..టీకాలు వ్యర్థమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆస్ట్రాజెనెకా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకూ చెబుతున్నా దాని ప్రకారం.. కరోనా టీకాల షెల్ఫ్ లైఫ్ ఆరు నెలలు. అంటే..టీకా తయారైనా ఆరు నెలలలోపే వీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే..ఈ వార్తపై అటు ఆస్ట్రాజెనెకాగానీ, ఇటు ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థగానీ స్పందించలేదని సదరు వార్త సంస్థ పేర్కొంది. 

Updated Date - 2021-03-30T23:31:35+05:30 IST