Ladakh crisis.. ముగిసిన భారత్, చైనా మిలిటరీ అధికారుల చర్చలు

ABN , First Publish Date - 2021-08-01T03:00:47+05:30 IST

వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాల ఉపసంహరణపై భారత్ చైనా మిలిటరీ అధికారుల మధ్య నేడు జరిగిన 12వ విడతల చర్చలు ముగిసాయి.

Ladakh crisis.. ముగిసిన భారత్, చైనా మిలిటరీ అధికారుల చర్చలు

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాల ఉపసంహరణపై భారత్, చైనా మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య నేడు జరిగిన 12వ విడత చర్చలు ముగిశాయి. ఈ మారు ఇరు దేశాల మిలిటరీ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సైన్యాల ఉపసంహరణను మరింత ముందుకు తీసుకెళ్లడమే నేటి సమావేశంలో ఎజెండా. ఈ దఫా హాట్ స్ప్రింగ్స్, గొగ్రా ప్రాంతాలపై చర్చ కేంద్రీకృతమైంది. దాదాపు మూడున్నర నెలల విరామం అనంతరం తాజా చర్చలు చోటుచేసుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ప్రతిష్టంభన తొలగించి శాంతి ఎలా నెలకొల్పాలనే అంశంపై చైనా అధికారులతో విస్తృతంగా చర్చించామని భారత మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-08-01T03:00:47+05:30 IST