నెమ్మదిగా వ్యాక్సినేషన్... డిసెంబర్ నాటికి అందరికీ టీకా అందేనా?

ABN , First Publish Date - 2021-07-17T14:24:30+05:30 IST

దేశంలోని ప్రతీఒక్కరికీ ఈ ఏడాది డిసెంబరు నాటికి...

నెమ్మదిగా వ్యాక్సినేషన్... డిసెంబర్ నాటికి అందరికీ టీకా అందేనా?

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతీఒక్కరికీ ఈ ఏడాది డిసెంబరు నాటికి టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. అయితే ఇంతలోనే కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదన్న ఆందోళన నెలకొంది. ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశ్యవాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. 


ఇప్పటికి ఆరు నెలలు దాటినప్పటికీ, కేవలం 40 కోట్ల డోసుల టీకాలు మాత్రమే వేయగలిగారు. దీనిని చూస్తుంటే డిసెంబరు నాటికి వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తయ్యేలా లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జూలై 16 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 41 కోట్ల, 10 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించారు. వీటిలో ఇప్పటికి 38 కోట్ల, 39 లక్షల, 2 వేల 614 డోసులు వినియోగమయ్యాయి. వీటిలో మెడికల్ వేస్టేజ్ కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 2 కోట్ల 51 లక్షల వ్యాక్సీన్ డోసులు ఉన్నాయి.

Updated Date - 2021-07-17T14:24:30+05:30 IST