కోవిడ్ కేసులు మే 15 కల్లా పతాక స్థాయికి.. ఐఐటీ శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2021-04-23T22:58:58+05:30 IST

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ సెకెండ్ వేవ్ మే 11-15 తేదీల మధ్య పతాక..

కోవిడ్ కేసులు మే 15 కల్లా పతాక స్థాయికి.. ఐఐటీ శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ సెకెండ్ వేవ్ మే 11-15 తేదీల మధ్య పతాక స్థాయికి చేరే అవకాశాలున్నట్టు ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే 15వ తేదీ కల్లా 33 నుంచి 35 లక్షల కేసులతో పతాక స్థాయికి చేరుకుని, మే నెలాఖరుల కల్లా కేసులు బాగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తల అంచనాగా ఉంది. ఏప్రిల్ 25-30 కల్లా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణాల్లో కొత్త కేసులు పెరిగే అవకాశాలున్నాయని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.


'మే 11-15 మధ్య ఇండియాలో యాక్టివ్ కేసులు పతాక స్థాయికి చేరుకోవచ్చు. ఆ తర్వాత అంతే వేగంగా కేసులు తగ్గుముఖం పడుతూ మే నెలాఖరుకి గణనీయంగా తగ్గుతాయి' అని ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ శాఖ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. కాగా, హర్యానాలోని అశోక యూనివర్శిటీకి చెందిన గౌతమ్ మీనన్ ఆయన బృందం ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్యలోగా సెకెండ్ వేవ్ పతాక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేసింది. 

Updated Date - 2021-04-23T22:58:58+05:30 IST