కరోనా ఎఫెక్ట్.. ప్రయాణ మార్గదర్శకాలను కఠినతరం చేసిన దుబాయి!

ABN , First Publish Date - 2021-04-20T19:26:03+05:30 IST

ఇండియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో పలు దేశాలు భారత్ నుంచి రాకపోకలను నిలిపివేస్తున్నాయి. భారత పర్యటనను రద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా కూడా తన పౌరులను

కరోనా ఎఫెక్ట్.. ప్రయాణ మార్గదర్శకాలను కఠినతరం చేసిన దుబాయి!

దుబాయి: ఇండియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో పలు దేశాలు భారత్ నుంచి రాకపోకలను నిలిపివేస్తున్నాయి. భారత పర్యటనను రద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా కూడా తన పౌరులను కోరింది. తాజాగా దుబాయి కూడా భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై కఠిన ఆంక్షలకు సిద్ధం అయింది. భారత్ నుంచి దుబాయికి వెళ్లే ప్రయాణికులకు సంబంధించి ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం భారత్ నుంచి దుబాయి వచ్చే ప్రయాణికులు.. ప్రయాణానికి 48 గంటల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని.. కొవిడ్ నెగెటివ్ సర్టిఫికిట్ తప్పనిసరిగా పొంది ఉండాలని స్పష్టం చేసింది. 48 గంటల్లో కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ పొందని వారికి దుబాయిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని పేర్కొంది.



అంతేాకాకుండా.. నెగెటివ్ సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్‌తో పాటు, సర్టిఫికెట్ పొందిన ల్యాబ్ వివరాలు కూడా ఉండాల్సిందేనని వెల్లడించింది. ప్రయాణికులు దుబాయి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సదరు సర్టిఫికెట్‌ను దుబాయి హెల్త్ అథారిటీ అధికారులు పరిశీలిస్తారని తెలిపింది. ఈ  మార్గదర్శకాలు ఏప్రిల్ 22 ఉదయం 12 గంటల నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించింది. కాగా.. గతంలో 72 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన ప్రయాణికులను దుబాయి అనుమతించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-20T19:26:03+05:30 IST