అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు !

ABN , First Publish Date - 2020-10-29T22:46:21+05:30 IST

అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం వెల్లడించింది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు !

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎంపిక చేసిన మార్గాలలో ఇంటర్నెషనల్ విమాన సర్వీసులను అప్పటి పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని డీజీసీఏ తెలియజేసింది. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, రెండు నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ విమానాలకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అలాగే మే నుండి 'వందే భారత్ మిషన్' కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలకు, జూలై నుండి ఎంపిక చేసిన దేశాలతో 'ఎయిర్ బబుల్' ఒప్పందం ద్వారా ఇంటర్నెషనల్ విమానాలు నడుస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు భారత్ 18 దేశాలతో 'ఎయిర్ బబుల్' ఒప్పందం చేసుకుంది. వీటిలో అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు యధావిధిగా నడుస్తాయని డీజీసీఏ వెల్లడించింది.  

Updated Date - 2020-10-29T22:46:21+05:30 IST