india vs pakistan asia cup: ఆసియా కప్‌లో ఎవరిది పైచేయి.. ఇండియా Vs పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది

ABN , First Publish Date - 2022-08-24T23:11:52+05:30 IST

ఆసియా కప్ -2022(Asia Cup)లో దాయాది దేశాలు భారత్ - పాకిస్తాన్ (India Vs Pakistan) ఈ ఆదివారం తలపడబోతున్నాయి. భా

india vs pakistan asia cup: ఆసియా కప్‌లో ఎవరిది పైచేయి.. ఇండియా Vs పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది

ముంబై : ఆసియా కప్ -2022(Asia Cup)లో దాయాది దేశాలు భారత్ - పాకిస్తాన్ (India Vs Pakistan) ఈ ఆదివారం తలపడబోతున్నాయి.  భావోద్వేగాలతో ముడిపడిన ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌పై సగటు క్రికెట్ అభిమానిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే మాజీ క్రికెటర్ల అంచనాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో ఏ జట్టు గెలవబోతోందనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో పాకిస్తాన్ - ఇండియా (Pakistan - India) మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి, ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..


ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది. భారత్ - పాకిస్తాన్ ఇప్పటివరకు ఆసియా కప్‌లో 14 సార్లు తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచ్‌లు భారత్ గెలవగా.. 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరి 5 మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుంటే భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగింటిలో ఇండియా  విజయబావుటా ఎగురవేయగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. అయితే ఆసియా కప్ గత ఎడిషన్ వరకు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరిగింది. ఈ ఏడాది నుంచి టీ20 ఫార్మాట్‌లో జరగబోతోంది. 


ప్రతీకారం తీరేనా..

2021 టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ ఆజమ్ సారధ్యంలోని పాకిస్తాన్‌ చేతిలో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు ఇద్దరే అలవోకగా చేధించారు. భారత బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఆ పరాభవం తర్వాత పాకిస్తాన్‌తో భారత్ తలపడబోతున్న మ్యాచ్ ఇదే. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి గతేడాది ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత కసిగా ఎదురుచూస్తోంది. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా ఈసారి బాబర్ ఆజమ్ సారధ్యంలోని పాక్ జట్టును ఢీకొట్టబోతోంది. ఫలితం ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే.

Updated Date - 2022-08-24T23:11:52+05:30 IST