జో బైడెన్ ప్రసంగంలో భారత్ ప్రస్తావన.. పుతిన్, జిన్‌పింగ్‌పైనా వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-23T22:49:23+05:30 IST

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌పై ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. సియాటెల్‌లో శుక్రవారం ఓ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నియంతృత్వ పాలకులు ఏయే అంశాలకు ఎక్కువ భయపడతారనే అంశంపై మాట్లాడారు.

జో బైడెన్ ప్రసంగంలో భారత్ ప్రస్తావన.. పుతిన్, జిన్‌పింగ్‌పైనా  వ్యాఖ్యలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగంలో భారత్ పేరును ప్రస్తావించారు.  సియాటెల్‌లో శుక్రవారం ఓ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నియంతృత్వ పాలకులు ఏయే అంశాలకు ఎక్కువ భయపడతారనే అంశంపై మాట్లాడారు. నిరంకుశవాదుల ప్రస్తావన ఉన్న ఈ టాపిక్‌లో  బైడెన్ భారత పేరును ప్రస్తావించారు. ‘‘ నిరంకుశ పాలకులు ఏయే అంశాలకు ఎక్కువ భయపడతారనే అంశంపై మాట్లాడుతున్నాను. దేశాలన్నింటికీ వాటి సొంత సమస్యలు ఉన్నాయి. భారత్‌ ముందు ఆ దేశ సవాళ్లు ఉన్నాయి. దీన్నిబట్టి సమస్యల పరిష్కారంలో దేశాలు పరస్పరం ఉమ్మడిగా పనిచేయవచ్చని అర్థమవుతోంది. ఇలా ఉమ్మడిగా పనిచేయడమే నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా అనిపిస్తోంది. అనేక దేశాలు నియంతృత్వ ధోరణికి మారుతున్నాయి. కేవలం చైనా మాత్రమే కాదు. రష్యాతోపాటు ఇంకా అనేక దేశాలు ఉన్నాయి’’ అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. 


చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లపై కూడా బైడెన్ మాట్లాడారు. చైనాకు వ్యతిరేకంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ కూటమి పనిచేయడాన్ని జీన్‌పింగ్ తనవద్ద ప్రస్తావించారని, క్వాడ్‌పై ఫిర్యాదు చేశారని గుర్తుచేసుకున్నారు. క్వాడ్ ఉమ్మడి పనిచేస్తుందని జిన్‌పింగ్‌కు ముక్కుసూటిగా చెప్పానన్నారు. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా భాగస్వాములుగా ఉన్న క్వాడ్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పనిచేస్తున్నట్టు చెప్పానని ప్రస్తావించారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ది కూడా ఇదే ధోరణి. ఫిన్లాండ్, స్వీడన్‌లు నాటో చేరడాన్ని పుతిన్ వ్యతిరేకించారన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికయ్యాక నాటో కూటమిని సులభంగా విచ్ఛిన్నం చేయొచ్చని పుతిన్ భావించారు. ఆరంభం నుంచే పుతిన్ తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ పుతిన్ జరగకూడదని కోరుకున్నదే జరుగుతోంది. ఫిన్లాండ్, స్విడన్ నాటో చేరాలనుకుంటున్నాయని బైడెన్ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-04-23T22:49:23+05:30 IST