భారత్‌లో Covid కు 47 లక్షల మంది బలి.. WHO రిపోర్ట్ విడుదల

ABN , First Publish Date - 2022-05-06T02:21:51+05:30 IST

జెనీవా : Covid deaths భారత్‌లోనే అధికమని World Health Organization రిపోర్ట్ పేర్కొంది. భారత్‌లో జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యకాలంలో 4.7 మిలియన్లు(47 లక్షల మంది) చనిపోయారని రిపోర్ట్ పేర్కొంది.

భారత్‌లో Covid కు 47 లక్షల మంది బలి.. WHO రిపోర్ట్ విడుదల

జెనీవా : Covid deaths భారత్‌లోనే అధికమని World Health Organization రిపోర్ట్ పేర్కొంది.  జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యకాలంలో భారత్‌లో 4.7 మిలియన్లు(47 లక్షల మంది) మంది చనిపోయారని రిపోర్ట్ వెల్లడించింది.  Indian govt ప్రకటించిన అధికారిక గణాంకాల కంటే మరణాలు 10 రెట్లు అధికమని రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదయిన కొవిడ్ మరణాల్లో మూడోవంతు భారత్‌లోనే నమోదయ్యాయని పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మృతుల సంఖ్య 15 మిలియన్లుగా (దాదాపు కోటిన్నర) ఉందని తెలిపింది. కాగా అన్ని దేశాల అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 6 మిలియన్లుగానే ఉందని ప్రస్తావించింది. భారత్‌లో రికార్డ్ స్థాయిలో అన్నీ దేశాల కంటే ఎక్కువ మరణాలు సంభవించాయని విశ్లేషించింది. 


డబ్ల్యూహెచ్‌వో లెక్కలు సరికాదు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను భారత ప్రభుత్వం తప్పుబట్టింది. ఏవో వెబ్‌సైట్లు, మీడియా రిపోర్టులను పరిగణలోకి తీసుకుని గణించడం సహేతుకం కాదని పునరుద్ఘాటించింది. డేటా సేకరించిన విధానం శాస్త్రీయంగా లేదని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పందించింది. భారత్ విషయంలో మాత్రమే మరణాల సంఖ్యను ఎక్కువగా చూపిస్తున్నారని గణాంకాలను తోసిపుచ్చింది. డబ్ల్యూహెచ్‌వో  ప్రకటించిన కొవిడ్ మృతుల సంఖ్య వాస్తవికతకు దూరంగా ఉందని వెల్లడించింది. జనన, మరణాల రిజిస్ట్రేషన్‌కు భారత్‌లో పటిష్టమైన విధానాలు ఉన్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు పేలవంగా ఉన్నాయి, శాస్త్రీయత విషయంలో ప్రశ్నించదగ్గవని విమర్శించింది.

Read more