Monkeypox: ఇండియాలో Monkeypox Case నమోదు కాలేదు కానీ ఎక్కువగా వాళ్లకే సోకే ఛాన్స్..

ABN , First Publish Date - 2022-05-29T14:52:14+05:30 IST

ఇండియాలో ఇప్పటికైతే ఒక్క Monkeypox Case కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో..

Monkeypox: ఇండియాలో Monkeypox Case నమోదు కాలేదు కానీ ఎక్కువగా వాళ్లకే సోకే ఛాన్స్..

న్యూఢిల్లీ: ఇండియాలో ఇప్పటికైతే ఒక్క Monkeypox Case కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో మంకీపాక్స్ కేసులు నమోదు కానంత మాత్రాన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని సైంటిస్ట్ ప్రగ్యా యాదవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయినట్లు WHO పేర్కొంది. సుమారు 200 మంకీపాక్స్ కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. పలు దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆయా దేశాల నుంచి వచ్చినవారిని గుర్తించే పనిలో పడింది. లక్షణాలున్నవారిని ఐసొలేట్‌ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చింది.



మంకీ పాక్స్‌ కేసులు నమోదైన దేశాలకు వెళ్లి వచ్చినవారు, శరీరంపై దద్దుర్లు వచ్చినవారి ఆరోగ్యాన్ని గమనించాలని పేర్కొంది. ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే జిల్లా వైద్యాధికారిని సంప్రందించాలని కోరింది. ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి డీఎంహెచ్‌వోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అనుమానితుల రక్తనమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మంకీ పాక్స్‌ బాధితుల్లో దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిపిస్తున్నాయి. హోమో సెక్సువల్స్‌, లైంగిక సంబంధాలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. వైరస్‌ ఇంక్యుబేషన్‌ వ్యవధి 2 నుంచి 4 వారాలు. వీటిలో కాంగో స్ట్రెయిన్‌, వెస్ట్‌ ఆఫ్రికా స్ట్రెయిన్‌ ప్రమాదకారులని ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-29T14:52:14+05:30 IST