అప్పటి ఆసీస్‌లా.. ప్రస్తుతం ఇండియా!

ABN , First Publish Date - 2021-02-28T10:59:50+05:30 IST

ఓ పాతికేళ్ల క్రితం క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని వణికించిన జట్టు ఆస్ట్రేలియా. ఆ సమయంలో ఆసీస్ టూర్‌కు వెళ్లాలంటే మిగతా జట్లు భయపడేవి అనడం అతిశయోక్తి కాదు. ఆటలో అగ్రెసివ్‌గా ఉంటూ మైదానంలో ప్రత్యర్థుల భరతం పడుతూ ఆసీస్ జట్టు ఎన్నో మైలురాళ్లు అందుకుంది.

అప్పటి ఆసీస్‌లా.. ప్రస్తుతం ఇండియా!

లండన్: ఓ పాతికేళ్ల క్రితం క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని వణికించిన జట్టు ఆస్ట్రేలియా. ఆ సమయంలో ఆసీస్ టూర్‌కు వెళ్లాలంటే మిగతా జట్లు భయపడేవి అనడం అతిశయోక్తి కాదు. ఆటలో అగ్రెసివ్‌గా ఉంటూ మైదానంలో ప్రత్యర్థుల భరతం పడుతూ ఆసీస్ జట్టు ఎన్నో మైలురాళ్లు అందుకుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం భారత జట్టును చూస్తుంటే 90లనాటి ఆసీస్ జట్టులా ఉందంటూ ఓ మాజీ పేసర్ కితాబిచ్చినందుకు. ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్.. భారత ఆటతీరును ప్రశంసించాడు. ‘ప్రత్యర్థి జట్టు పీక పట్టుకొని ఒకటి తర్వాత మరొకటి చొప్పున విజయాలు సాధించడం భారత్‌కు తెలుసు’ అని గాఫ్ అన్నాడు. ఇంగ్లండ్ జట్టు వరుస మ్యాచుల్లో చిత్తుగా ఓడిందని, పునరాగమనం చేయడం ఆ జట్టుకు సవాలేనని పేర్కొన్నాడు.

Updated Date - 2021-02-28T10:59:50+05:30 IST