భిన్న మతాలు, కులాల శక్తి భారత్‌

ABN , First Publish Date - 2022-10-04T05:28:04+05:30 IST

భిన్న మతాలు, కులాలతో ఏకైక శక్తివంతమైన దేశం భారతదేశమని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏపీ ప్రాంత కార్యాకరిని వోలేటి సత్యనారాయణ అన్నారు.

భిన్న మతాలు, కులాల శక్తి భారత్‌
: రావికమతంలో కవాతు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు


ఆర్‌ఎస్‌ఎస్‌ ఏపీ ప్రాంత కార్యాకరిని సత్యనారాయణ

రావికమతం, అక్టోబరు 3:  భిన్న మతాలు, కులాలతో ఏకైక శక్తివంతమైన దేశం భారతదేశమని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏపీ ప్రాంత కార్యాకరిని వోలేటి సత్యనారాయణ అన్నారు. స్థానిక హైస్కూల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ సమారూప్‌ కార్యక్రమం వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  కార్యశక్తి అనేది ఎప్పుడూ ఒక్క వ్యక్తి నుంచే ప్రారంభమవుతోందన్నారు. స్వయం సేవక్‌లు పట్టువీడని దేశభక్తులుగా ఉండాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి 2025 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్థాయిలో సంఘ శాఖలు ఏర్పాటు కావాలన్నారు. అంతకుముందు గ్రామంలోని వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు కవాతు నిర్వహించారు. వీరిపై గ్రామస్థులు పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ సేవక్‌ రాపర్తి సత్యనారాయణ, వర్గ కావ్యవాహ్‌ బండారు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T05:28:04+05:30 IST