చైనా చదువులు.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-09-11T05:03:21+05:30 IST

చైనాలో(China) మెడిసిన్, ఇతర కోర్సులు చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.

చైనా చదువులు.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన

ఎన్నారై డెస్క్: చైనాలో(China) మెడిసిన్, ఇతర కోర్సులు చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. చైనాలో తక్కువగా ఉన్న ఉత్తీర్ణత శాతం, విదేశీ విద్యార్థుల తప్పనిసరిగా అధికారిక భాష నేర్చుకోవాలన్న నిబంధన తదితర అంశాల గురించి భారత విద్యార్థులను హెచ్చరించింది. చైనాలో చదువు పూర్తైన తరువాత భారత్‌లో ప్రాక్టీస్ చేసేందుకు ముందుగా మరో పరీక్ష పాసవ్వాలన్న విషయాన్ని కూడా కేంద్రం తన ప్రకటనలో ప్రస్తావించింది. కొవిడ్ ఆంక్షల(Corona Restrictions) పేరిట చైనా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు వీసాల జారీపై నిషేధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఎంతో ప్రస్తుతం భారత్‌లో చిక్కుకుపోయారు. అధికారిక అంచనాల ప్రకారం.. 23 వేల మంది భారతీయ స్టూడెంట్లు వివిధ చైనా యూనివర్శిటీల్లో చదువుకుంటున్నారు. వీరిలో అత్యధికులు మెడిసిన్ చదువుకుంటున్నారు. 


కాగా.. వీసాల జారీపై(Visa) రెండేళ్ల పాటు కొనసాగిన నిషేధాన్ని(Ban) చైనా ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. ఎంపిక చేసిన కొందరు భారతీయులకు వీసాల జారీని ప్రారంభించింది. అయితే.. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం మరో అడ్డంకిగా మారింది. పరిమిత సంఖ్యలోనైనా విమాన సర్వీసులను పునరుద్ధరించే విషయంపై ప్రస్తుతం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు.. చైనా యూనివర్శిటీలు కొత్తగా విద్యార్థులను చేర్చుకోవడం కూడా ప్రారంభించాయి. దీంతో.. చైనాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల కోసం కేంద్రం తాజాగా ఈ సూచనలు చేసింది. 

Updated Date - 2022-09-11T05:03:21+05:30 IST