శ్రీలంకకు మరింత భారత్, జపాన్ మరింత సహకారం...

ABN , First Publish Date - 2022-05-22T22:16:55+05:30 IST

తీవ్ర ఆర్థికసంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆసియా దేశాలైన భారత్, జపాన్ మరింత సహకారాన్నందించనున్నాయి.

శ్రీలంకకు మరింత భారత్, జపాన్ మరింత సహకారం...

న్యూఢిల్లీ : తీవ్ర ఆర్థికసంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆసియా దేశాలైన భారత్, జపాన్ మరింత సహకారాన్నందించనున్నాయి. ఈ క్రమంలో... మిలియన్ల డాలర్ల విలువైన ఆహార సామాగ్రిని అందించనున్నాయి, ఇది సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజల కోసం బియ్యం, మందులు, పాలపొడి తదితర అత్యవసర సహాయ సామాగ్రితో కూడిన భారత నౌక మరికొద్ది గంటల్లో(ఈరోజు... ఆదివారం) కొలంబో చేరుకోనున్నట్లు భారత హైకమిషన్ ఇప్పటికే వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మూడు రోజుల క్రితం(బుధవారం) చెన్నై నుండి శ్రీలంకకు పంపిన మొట్టమొదటి సహాయ సామాగ్రితో కూడిన ఓడను జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. 


మొదటి సరుకులో 9 వేల MTల బియ్యం, 200 MTల మిల్క్ పౌడర్, 24 MTల  లైఫ్ సేవింగ్ మెడిసిన్‌లు కలిపి రూ. 45 కోట్ల విలువైనవి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్... చెన్నై ఓడరేవు వద్ద ఈ కార్గోను జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు జపాన్ కూడా అవసరమైన ఆహార రేషన్లు, పాఠశాల భోజన కార్యక్రమం కోసం ప్రపంచ ఆహార కార్యక్రమం(WFP) కార్యక్రమం ద్వారా USD 1.5 మిలియన్లను అందించనున్నట్లు ప్రకటించింది. జపాన్ ప్రభుత్వం సుమారు 15 వేల మంది  పట్టణ, గ్రామీణ ప్రజలు సహా మరో 3.80 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు బలవర్ధకమైన బియ్యం, పప్పులు, నూనెలు సహా మూడు నెలలకు సరిపోను ఆహార సామాగ్రిని అందించేందుకు WFP ద్వారా 1.5 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. శ్రీలంక తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించిన విషయం తెలిసింనదే. కాగా... 1948 లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత... శ్రీలంక తరచూ అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కాగా... విద్యుత్తు కోతలు, పెరుగుతున్న ఆహార ధరలు ప్రజల కష్టాలను మరింతగా పెంచతుతూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా... తీవ్ర ఆర్థిక సంక్షోభం శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి దారితీయడంతోపాటు అధ్యక్షుడు రాజపక్సేల రాజీనామా డిమాండ్‌ కు దారితీసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-05-22T22:16:55+05:30 IST