Congress : భారత దేశం చాలా వరకు శ్రీలంకలా ఉంది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-05-18T23:18:14+05:30 IST

దేశంలో ద్రవ్యోల్బణం (Inflation), నిరుద్యోగం (Unemployment

Congress : భారత దేశం చాలా వరకు శ్రీలంకలా ఉంది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం (Inflation), నిరుద్యోగం (Unemployment) పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశం చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్ళించకూడదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడం వల్ల వాస్తవాలు మారబోవని అన్నారు. 


రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ప్రజల దృష్టిని మళ్లించడం వల్ల వాస్తవాలు మారబోవు. భారత దేశం చాలా వరకు శ్రీలంక మాదిరిగా కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఆయన మూడు గ్రాఫ్‌లను జత చేశారు. ఇరు దేశాల్లో నిరుద్యోగం, పెట్రోలు ధరలు, మత హింసకు సంబంధించిన గ్రాఫ్‌లను జత చేశారు. సాయుధ సంఘర్షణ ప్రాంతాలు, ఈవెంట్ డేటా ప్రాజెక్ట్, లోక్‌సభ అన్‌స్టార్డ్ ప్రశ్నలు, సీఎంఐఈ, పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ గ్రాఫ్‌లను రూపొందించినట్లు తెలిపారు. 


ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ (Congress) తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, ధరలు, నిరుద్యోగం పెరుగుతున్నాయని, భారత దేశం (India) శ్రీలంక (Sri Lanka) బాట పడుతోందని ఆరోపిస్తోంది. 




Updated Date - 2022-05-18T23:18:14+05:30 IST