బ్యాంకు మోసాలు.. రోజూ వంద కోట్ల నష్టం

Published: Tue, 29 Mar 2022 16:30:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్యాంకు మోసాలు.. రోజూ వంద కోట్ల నష్టం

బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు, స్కాముల వల్ల దేశంలో రోజుకు సగటున వంద కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, గడిచిన ఐదేళ్ల నుంచి ప్రతి ఏడాది ఈ నష్టం తగ్గుతూ వస్తోందని డాటా చెబుతోంది. 2015 నుంచి గతేడాది డిసెంబర్ 31 వరకు ఆర్‌బీఐ సేకరించిన డాటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆర్‌బీఐ డాటా ప్రకారం.. బ్యాంకు మోసాలు, స్కాముల వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్న రాష్ట్రాల్లో 50 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. మొత్తం ఈ ఐదు రాష్ట్రాల్లోనే దాదాపు రెండు లక్షల కోట్లకుపైగా (83 శాతం) నష్టం జరుగుతోంది. మరోపక్క, ఆర్థిక శాఖ ఈ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మోసానికి గురైన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసాలు కొంతవరకు తగ్గుతున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.