మరో రెండు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం !

ABN , First Publish Date - 2021-03-07T14:58:49+05:30 IST

భారత్ మరో రెండు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. సీషెల్స్, ఉజ్బెకిస్తాన్ తాజాగా ఈ జాబితాలో చేరాయి.

మరో రెండు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం !

న్యూఢిల్లీ: భారత్ మరో రెండు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. సీషెల్స్, ఉజ్బెకిస్తాన్ తాజాగా ఈ జాబితాలో చేరాయి. దీంతో ఈ రెండు దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలకు మార్గం సుగమైంది. అలాగే ఆఫ్రికాలోని ఏ దేశంలోనైనా చిక్కుకున్న భారత పౌరులతో పాటు భుటాన్, నేపాల్ దేశస్థులు కూడా సీషెల్స్ ద్వారా ఇండియాకు వచ్చేందుకు వీలు ఏర్పడింది. అయితే, భారత్ నుంచి సీషెల్స్ విమానాల్లో ప్రయాణించే వారి గమ్యస్థానం ఆఫ్రికన్ దేశాలు మాత్రమే అయ్యి ఉండాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే భారత్ 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కొత్తగా అగ్రీమెంట్ చేసుకున్న టాంజానియాతో పాటు రష్యా, అమెరికా, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఖతార్, అఫ్గానిస్థాన్, మాల్దీవులు, యూఏఈ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 

Updated Date - 2021-03-07T14:58:49+05:30 IST