గడచిన 24 గంటల్లో పెరిగిన కరోనా కేసులు... 518 మంది మృతి!

ABN , First Publish Date - 2021-07-18T16:10:18+05:30 IST

దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తున్నదనే భయాందోళనలు...

గడచిన 24 గంటల్లో పెరిగిన కరోనా కేసులు... 518 మంది మృతి!

న్యూదిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తున్నదనే భయాందోళనలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 41 వేల 157 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 518 మంది కరోనాతో కన్నుమూశారు. 


కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 97.31గా ఉండటం ఉపశమనం కలిగించే విషయం. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 3 కోట్ల, 2 లక్షల, 69 వేల 796 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 4 లక్షల, 22 వేల మంది కరోనాకు చికిత్స పొందుతున్నారని, మొత్తం కరోనా బాధితులలో ఇది 1.36 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దీనికి ముందు జూలై 17న 38 వేల 79 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-07-18T16:10:18+05:30 IST