న్యూఢిల్లీ, మార్చి 2: రష్యా యుద్ధం కారణంగా సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. జాతీయ విపత్తు స్పందన బలగాల విభాగం దుప్పట్లు, చాపలు, సౌరవిద్యుత్ దీపాలు, వైద్య సామగ్రి వంటి వాటిని ఉక్రెయిన్‌కు రెండు విమానాల్లో చేరవేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఉక్రెయిన్‌కు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.