Ready India : పదేళ్ళలో 6G సేవలు : మోదీ

ABN , First Publish Date - 2022-05-17T23:19:29+05:30 IST

రానున్న పదేళ్ళలో భారత దేశం 6G సేవల ప్రారంభానికి సిద్ధంగా

Ready India : పదేళ్ళలో 6G సేవలు : మోదీ

న్యూఢిల్లీ : రానున్న పదేళ్ళలో భారత దేశం 6G సేవల ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. దీని కోసం అవసరమైన కృషిని ఓ టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ప్రారంభించిందని చెప్పారు. 5జీ టెక్నాలజీ వల్ల రానున్న పదిహేనేళ్ళలో భారత దేశ ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్లు సమకూరుతుందని తెలిపారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మంగళవారం మాట్లాడారు. 


5G టెక్నాలజీ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్లు సమకూరుతుందని చెప్పారు. 5G కేవలం ఇంటర్నెట్ వేగాన్ని మాత్రమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి వేగాన్ని కూడా పెంచుతుందని తెలిపారు. ఈ దశాబ్దం చివరినాటికి 6G సర్వీసులను ప్రారంభించగలగాలన్నారు. దీనికి సంబంధించిన కృషిని టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ప్రారంభించిందన్నారు. 


అవినీతి, విధానపరమైన పక్షవాతానికి గుర్తుగా 2G శకం నిలిచిందని, ఆ దశ నుంచి 4జీకి, ఇప్పుడు 5జీకి పారదర్శకంగా మన దేశం మారిందని తెలిపారు. మన దేశంలో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు (Mobile Manufacturing Units) 2 నుంచి 200కు పెరిగాయని తెలిపారు. నేడు ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా India మారిందన్నారు. 


ఐఐటీ మద్రాస్ (IIT Madras) నేతృత్వంలో ఎనిమిది సంస్థలు కలిసి మన దేశంలో అభివృద్ధి చేసిన 5G టెస్ట్ బెడ్‌ను మోదీ ప్రారంభించారు. టెలికాం ఇండస్ట్రీ, స్టార్టప్స్, పరిశోధకులు తమ నమూనాల పనితీరును ఈ టెస్ట్ బెడ్‌లో పరీక్షించుకోవచ్చు.


Updated Date - 2022-05-17T23:19:29+05:30 IST