ireland టూర్‌లో ఈ యువకెరటాలకు దక్కేనా ?

ABN , First Publish Date - 2022-06-21T03:30:58+05:30 IST

india should try out vs ireland saysing experts

ireland టూర్‌లో ఈ యువకెరటాలకు దక్కేనా ?

న్యూఢిల్లీ : స్వదేశంలో దక్షిణాఫ్రికా(South Africa)పై టీ20 సిరీస్‌లో పలువురు యువ ఆటగాళ్లను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించింది. ఐపీఎల్(IPL)2022లో అద్భుతంగా రాణించిన యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సౌతాఫ్రికాపై ఫర్వాలేదనిపించాడు. అయితే జట్టులోనే ఉన్నా పలువురు యువకెరటాలకు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కలేదు. దీంతో త్వరలోనే ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌లో యువ ఆటగాళ్లకు చోటుదక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


రెండు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఈ నెల చివరన ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రిషబ్ పంత్, శ్రేయస్అ య్యర్‌తోపాటు ప్రధాన ఆటగాళ్లు గతేడాది వాయిదా పడిన చివరి టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లారు. ప్రధాన ప్లేయర్ల గైర్హజరీ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని యువజట్టు ఐర్లాండ్ పర్యటనలో ఆడబోతోంది. ఈ టూర్‌లో ముగ్గురు యువ ఆటగాళ్లను పరీక్షించాలనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి ఆటగాళ్లలో ఐపీఎల్ 2022లో చెలరేగిన ఉమ్రాన్ మాలిక్ ముందువరుసలో ఉన్నాడు. జట్టులోనే ఉన్నా సౌతాఫ్రికాపై మ్యాచ్ ఆడే అవకాశం ఉమ్రాన్ మాలిక్‌కు దక్కలేదు. దీంతో ఐర్లాండ్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇక ఈ జాబితాలో ఉన్న రెండవ ఆటగాడిగా బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. అద్భుతంగా రాణిస్తున్న రాహుల్ త్రిపాఠిని ఎందుకు పరీక్షించకూడదనే పలువురు క్రికెట్ నిపుణులు అంటున్నారు. అవకాశం ఇస్తే టాలెంట్ బయటపడుతుందంటున్నారు. మరోవైపు ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరపున విశేషంగా ఆకట్టుకున్న అర్షదీప్ సింగ్‌కు అవకాశమివ్వాలనే సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌లో ఉత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసిందే. మరి ఈ ముగ్గురి ఆటగాళ్లల్లో ఎవరికీ చోటు దక్కుతుందో వేచిచూద్దాం..

Updated Date - 2022-06-21T03:30:58+05:30 IST