T20 World Cup: టీమిండియా జట్టు ఇదా.. అభిమానులు బీసీసీఐపై ఏ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారంటే..

ABN , First Publish Date - 2022-09-13T02:34:35+05:30 IST

బీసీసీఐ (BCCI) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్‌కు (T20 World Cup) టీమిండియా జట్టును..

T20 World Cup: టీమిండియా జట్టు ఇదా.. అభిమానులు బీసీసీఐపై ఏ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారంటే..

బీసీసీఐ (BCCI) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్‌కు (T20 World Cup) టీమిండియా జట్టును (Team India) బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో.. కేఎల్ రాహుల్ (KL Rahul) వైస్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో (Team India T20 World Cup) బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌బై ప్లేయర్లుగా షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చాహర్‌ ఉన్నారు.


ఇదిలా ఉండగా.. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్‌నకు టీమిండియా జట్టును ప్రకటించిన కొంతసేపటికే టీమిండియా ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ట్విట్టర్‌లో #BoycottBCCI ట్రెండ్ అయింది. అందుకు కారణం లేకపోలేదు. టీ20 వరల్డ్ కప్‌నకు టీమిండియా జట్టు కోసం బీసీసీఐ ఎంపిక చేసిన ఆటగాళ్ల విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ (Rishab Pant), కేఎల్ రాహుల్‌ (KL Rahul) టీ20 ఫార్మాట్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతుంటే ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపిక చేసిన జట్టులో ఆ ఇద్దరికీ చోటు ఎలా కల్పిస్తారని టీమిండియా అభిమానుల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు.



సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తుంటే.. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టేయడం ఏంటని బీసీసీఐ వైఖరిపై పెదవి విరిచారు. అంతేకాదు.. మహ్మద్ షమీని స్టాండ్‌బైకి పరిమితం చేయడాన్ని కూడా తప్పుబడుతున్నారు. పంత్‌ను ఎంపిక చేయడంపై మాత్రం కొందరు నెటిజన్లు కారాలుమిరియాలు నూరుతున్నారు. టీ20ల్లో అతని పేలవ రికార్డును ప్రస్తావిస్తూ మరీ విమర్శిస్తున్నారు. 56 టీ20ల్లో 23 యావరేజ్‌తో 126 స్ట్రయిక్‌ రేట్‌తో ఉన్న రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుని సంజూ శాంసన్‌ను దూరం పెట్టడం ఏంటని బీసీసీఐని నిలదీస్తున్న పరిస్థితి. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్‌లో తలపడనుంది.


టీమిండియా: రోహిత్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), కోహ్లి, పంత్‌, సూర్యకుమార్‌, దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, బూమ్రా, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ హుడా, అర్ష్‌దీప్‌, భువనేశ్వర్‌


స్టాండ్‌బై ప్లేయర్స్‌: షమీ, చాహర్‌, అయ్యర్‌, బిష్ణోయ్‌

Updated Date - 2022-09-13T02:34:35+05:30 IST