
అహ్మదాబాద్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ 176 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీయడంతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఫలితంగా మరో 6.1 ఓవర్లు మిగిలి ఉండగానే 176 పరుగులకు ఆలౌట్ అయింది.
విండీస్ బ్యాటర్లలో జాసన్ హోల్డర్ ఒక్కడే భారత బౌలర్లను కాస్తంత ఎదురొడ్డ గలిగాడు. 71 బంతులు ఎదుర్కొన్న హోల్డర్ నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్ 3, ప్రసీద్ కృష్ణ 2, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి