
భారత ఆర్మీ మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించగల మీడియం రేంజ్ గగనతల రక్షణ క్షిపణిని ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని డీఆర్డీఓ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉదయం పదిన్నరకు జరిపిన ఈ ప్రయోగంలో క్షిపణి కచ్చితమైన లక్ష్యాన్ని సాధించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. సుదూరంలోని లక్ష్యాన్ని నేరుగా తాకినట్లు చెప్పింది. ఇది భారత ఆర్మీకి మరింత శక్తినివ్వనుంది.