Kyivలో Indian Embassy రీఓపెన్‌కు సిద్ధం.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-05-14T02:28:52+05:30 IST

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కీవ్‌ నగరంలో మూతపడిన భారత రాయబార కార్యాలయం త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది.

Kyivలో Indian Embassy రీఓపెన్‌కు సిద్ధం.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కీవ్‌ నగరంలో మూతపడిన భారత రాయబార కార్యాలయం త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది. పోలాండ్ రాజధాని వార్సా నుంచి తాత్కాలిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇండియన్ ఎంబసీ మే 17, 2022 నుంచి కీవ్‌లో పున:ప్రారంభం కానుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడే ఇటివల ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ నగరంతోపాటు కీవ్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు. మరోవైపు అమెరికాతోపాటు పలు దేశాలు కీవ్ తమ రాయబార కార్యాలయాలను పున:ప్రారంభిస్తున్నట్టు ఇదివరకే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఇండియన్ ఎంబసీ కార్యాకాలపాలను షరూ చేసేందుకు నిర్ణయించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరమైన నేపథ్యంలో మార్చిలో ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు బంద్ అయ్యాయి. ఉక్రెయిన్ నుంచి అత్యధిక భారతీయులు తరలించిన అనంతరం మార్చి 13న ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని పోలాండ్ రాజధాని వార్సాకు తరలించిన విషయం తెలిసిందే. 

Read more