అతి త్వరలో భారత పౌరులకు E-passports.. మంత్రి Jaishankar వెల్లడి

ABN , First Publish Date - 2022-06-26T16:24:59+05:30 IST

విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను (e-passport) తీసుకువస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. 2

అతి త్వరలో భారత పౌరులకు E-passports.. మంత్రి Jaishankar వెల్లడి

న్యూఢిల్లీ: విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను (E-passport) తీసుకువస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. అన్నట్టుగానే తాజాగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో భారత పౌరులకు ఈ-పాస్‌పోర్ట్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేసేందుకు, వ్యక్తిగత గుర్తింపు చోరీ కాకుండా దేశ పౌరులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా జై శంకర్ మాట్లాడుతూ.. దేశ పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు భారత విదేశాంగ శఆఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. మంత్రిత్వశాఖకు చెందిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం(PSP) కొత్త వెర్షన్ PSP 2.O ద్వారా భారతీయులకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలను అందించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. 


పేపర్ రహిత డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకే పాస్‌పోర్ట్ సేవా వ్యవస్థను డీజీ లాకర్ వ్యవస్థతో అనుసంధానం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. తపాలాశాఖ సహకారంతో దేశవ్యాప్తంగా 428 పాస్‌పోర్ట్ సవేవా కేంద్రాలను(POPSK) అనుసంధానించే ప్రక్రియలను చేపట్టడం ద్వారా సులభంగానే పౌరులు పాస్‌పోర్ట్‌ను తమ ఇంటి వద్దకే చేరేలా ఉపయోగపడిందని మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే విదేశాల్లోని 178 భారత ఎంబసీలు, కాన్సులేట్లలో పాస్‌పోర్ట్ జారీ వ్యవస్థను సక్సెస్‌పుల్‌గా ఏకీకృతం చేయడం జరిగిందన్నారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విదేశాంగ శాఖ పనితీరు భేష్ అని మంత్రి కొనియాడారు. ఆ సమయంలో కూడా నెలవారీగా సగటున దేశవ్యాప్తంగా 9లక్షల  కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఈ-పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడించారు.


* సులువుగా, చాలా తక్కువ సమయంలో యాక్సెస్ చేయగలగడం. 

* ఈ-పాస్‌పోర్ట్ వెనక భాగంలో చిన్న సిలికాన్ చిప్ ఉంటుంది. 

* ఈ చిప్‌లో 64 కిలోబైట్ల మెమొరీ స్పెస్ ఉంటుంది. 

* ఈ చిన్న చిప్‌లోనే పాస్‌పోర్టుదారుడి ఫొటో, ఫింగర్ ప్రింట్‌తో సహా అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. 

* పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు బయోమెట్రిక్ డీటైల్స్ కూడా ఈ చిప్‌లో స్టోర్ అయి ఉంటాయి. దీంతో గత ప్రయాణాల వివరాలు కూడా ఇందులో నిల్వ ఉంటాయి. 

* వినియోగదారుడు ఒకసారి తీసుకున్న ఈ-పాస్‌పోర్ట్‌పై 30 విజిట్స్ చేయవచ్చు. 

* అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్‌పోర్ట్‌ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు. 


ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ డిజిటల్ పాస్‌పోర్ట్ రూపుదిద్దుకుంది. అలాగే ఈ-పాస్‌పోర్ట్ విధానం వల్ల నకిలీలను అరికట్టవచ్చు. ఈ కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కావున నకిలీ పాస్‌పోర్ట్‌లు వాడే వారిని నిలువరించే వీలు కలుగుతుంది. ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై చేసేందుకు పాస్‌పోర్ట్‌లోని మైక్రో చిప్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Updated Date - 2022-06-26T16:24:59+05:30 IST