వచ్చే వారం Dubai విమాన టికెట్ల ధరలు డబుల్.. కారణం ఏంటంటే..

Sep 28 2021 @ 12:31PM

దుబాయ్: యూఏఈ-భారత్ మధ్య విమాన టికెట్లు భారీగా పెరగనున్నాయని సమాచారం. దీనికి కారణం వచ్చే వారం ప్రారంభం కానున్న దుబాయ్ ఎక్స్‌పో. అక్టోబర్ 1 నుంచి మార్చి వరకు జరిగే దుబాయ్ ఎక్స్‌పో‌కు భారత్ నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ పీక్ సీజన్‌లో విమాన టికెట్ల ధరలకు రెక్కలు రావడం ఖాయమని ట్రావెల్ ఎజెన్సీలు, విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-దుబాయ్ మధ్య విమాన ఛార్జీలు 1500 దిర్హమ్స్(రూ.30వేలు)గా ఉన్నాయి. అదే వచ్చేవారానికి ప్రయాణికుల నుంచి డిమాండ్ నేపథ్యంలో ఈ ధరలు 2వేల నుంచి 3వేల దిర్హమ్స్(రూ.40వేలు) వరకు చేరుకునే అవకాశం ఉందని ఓ ట్రావెల్ ఏజెంట్ అభిప్రాయపడ్డారు. ఇక ముంబై నుంచి దుబాయ్‌కు టికెట్ ధర 1,700 దిర్హమ్స్(రూ.34వేలు)గా ఉండొచ్చని తెలిపారు. అలాగే జూలైలో కొచ్చి, కాలికట్ నుంచి దుబాయ్‌కు వెయ్యి దిర్హమ్స్(రూ.20వేలు)గా ఉన్న ఛార్జీలు ఈ పీక్ సీజన్‌లో 1,500 దిర్హమ్స్(రూ.30వేలు)కు పెరిగే వీలుందన్నారు. 

టికెట్ ధరలు పెరగకుండా ఉండాలంటే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను భారీగా పెంచడం ఒక్కటే మార్గమని ట్రావెల్ ఏజెంట్ చెప్పుకొచ్చారు. ఇక ప్రతియేటా డిసెంబర్‌లో యూఏఈకి భారత్ నుంచి ప్రయాణాలు భారీగా పెరుగుతుంటాయని, అలాంటిది ఈ ఏడాది ఎక్స్‌పో ఉండడంతో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉంటుందన్నారు. ఇదిలాఉంటే.. యూకే ఇటీవల కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లైతే తమ దేశానికి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ దేశాలా జాబితాలో యూఏఈ కూడా ఉంది. దాంతో భారత ప్రయాణికులు బ్రిటన్‌లో క్వారంటైన్ నుంచి తప్పించుకోవడానికి యూఏఈ మీదుగా జర్నీ చేస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా విమాన టికెట్లు ధరలు పెరగడానికి ఒక కారణం అవుతుందని మరో ట్రావెల్ ఏజెంట్ అభిప్రాయపడ్డారు. 

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.