ind vs aus: హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..

ABN , First Publish Date - 2022-09-21T02:30:36+05:30 IST

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 6 వికెట్ల నష్టానికి..

ind vs aus: హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..

మొహాలీ: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్యా 30 బంతుల్లో ఐదు సిక్సులు, ఏడు ఫోర్లతో 71 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. రోహిత్ శర్మ 9 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఎల్లిస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌గా దొరికి రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ నిలకడగా రాణించి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా అదరగొట్టాడు.



టార్గెట్ భారీగానే ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్స్‌తో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో మ్యాక్స్‌వెల్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసీస్‌ జట్టు భారత్‌‌కు వచ్చింది. ఓపెనర్‌ వార్నర్‌కు విశ్రాంతినివ్వగా పేసర్లు స్టార్క్‌, స్టొయినిస్‌, మార్ష్‌కు గాయాలయ్యాయి. కెప్టెన్‌ ఫించ్‌ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే వన్డేలకు గుడ్‌బై చెప్పిన అతడు ఈ సిరీస్‌తో సత్తా చాటాలని ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. ఇక, డాషింగ్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ అరంగేట్రానికి ఎదురుచూస్తున్నాడు. విదేశీ లీగ్‌ల్లో భారీ షాట్లతో విరుచుకుపడే టిమ్‌తో భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి.

Updated Date - 2022-09-21T02:30:36+05:30 IST