India vs Australia: కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడా? లేదా?

ABN , First Publish Date - 2022-09-21T01:38:32+05:30 IST

ఆసియాకప్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ దానిని కొనసాగిస్తాడనుకుంటే అభిమానులను మరోమారు తీవ్ర నిరాశకు గురిచేశాడు

India vs Australia: కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడా? లేదా?

మొహాలీ: ఆసియాకప్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ దానిని కొనసాగిస్తాడనుకుంటే అభిమానులను మరోమారు తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి 20లో ఏడు బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆసియాకప్‌లో రెండు అర్ధ సెంచరీలు, అజేయ సెంచరీతో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేసిన కోహ్లీ గాడినపడినట్టేనని, అతడి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం మళ్లీ మొదలవుతుందని అభిమానులు సంబరపడ్డారు. అయితే, తాజా మ్యాచ్‌లో రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం క్రికెట్ ప్రేమికులను తీవ్రంగా నిరాశపరిచింది.


మరోవైపు, రోహిత్ శర్మ కూడా పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతుతున్నాడు. అతడి నుంచి చాలాకాలంగా భారీ స్కోరు కరువైంది. తాజా మ్యాచ్‌లోనూ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపడ్డాడు. ఫోర్, సిక్సర్ బాది ఊపుమీదున్నట్టు కనిపించినప్పటికీ హేజిల్‌వుడ్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడి  నాథన్ ఎల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా వెంటనే అవుట్ కావడంతో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ క్రీజులో కుదురుకున్నాడు.


కేఎల్ రాహుల్‌కు అండగా నిలుస్తూ పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ ఆ వెంటనే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. మొత్తంగా 35 బంతులు ఆడిన రాహుల్ 4 ఫోర్లు, 3  సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిశాయి. భారత్ మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (46), హార్దిక్ పాండ్యా (2) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-09-21T01:38:32+05:30 IST