అదరగొట్టిన హుడా

Published: Sun, 03 Jul 2022 04:05:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అదరగొట్టిన హుడా

 టీ20 వామప్‌లో భారత్‌ గెలుపు

డెర్బీ (ఇంగ్లండ్‌): ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌.. టీ20 వామప్‌ మ్యాచ్‌లో డెర్బీషైర్‌ కౌంటీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట డెర్బీషైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. వేన్‌ మాడ్సెన్‌ (28), హిల్టన్‌ కార్ట్‌రైట్‌ (27), హ్యూజెస్‌ (24) రాణించారు. అర్ష్‌దీప్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక, ఛేదనలో దీపక్‌ హుడా (37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) అద్భుత హాఫ్‌ సెంచరీతో అదరగొట్టడంతో భారత్‌ మరో 20 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఈ క్రమంలో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (38), సూర్యకుమార్‌ (36 నాటౌట్‌)తో కలిసి హుడా ధారాళంగా పరుగులు రాబట్టాడు. మరో టీ20 వామ్‌పలో భాగంగా భారత్‌ ఆదివారం నార్తంప్టన్‌షైర్‌తో ఆడనుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.