Tokyo Olympics: మహిళల హాకీలో ఇండియా థ్రిల్లింగ్ విన్

ABN , First Publish Date - 2021-07-30T21:53:02+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఖాతా తెరించింది. పూల్ ఎలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత

Tokyo Olympics: మహిళల హాకీలో ఇండియా థ్రిల్లింగ్ విన్

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఖాతా తెరిచింది. పూల్ ఎలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచింది. మూడు వరుస పరాజయాల తర్వాత భారత జట్టుకు ఇది తొలి విజయం. రేపు దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో కనుక విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్ అవకాశాలు ఉంటాయి.


ఈ మ్యాచ్‌లో అందివచ్చిన 14 పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో విఫలమైన రాణీ సేన.. ఫీల్డ్ గోల్ ద్వారా విజయాన్ని అందుకుంది. అది కూడా మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాల ముందు ఈ గోల్ లభించింది. నవనీత్ కౌర్ రివర్స్ హిట్‌లో అద్భుతంగా గోల్ చేసింది.  


ఒలింపిక్స్‌ను భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 1-5తో ఓటమి పాలైంది. ఆ తర్వాత జర్మనీ, డిఫెండింగ్ చాంపియన్స్ గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీంతో గ్రూప్ స్టేజ్ నుంచే భారత జట్టు వెనక్కి మళ్లడం ఖాయమని భావించారు. అయితే, నేటి మ్యాచ్‌లో విజయంతో ఆశలు నింపారు. 

Updated Date - 2021-07-30T21:53:02+05:30 IST