indiaVsSouthafrica: టాస్ గెలిచిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ ఏం ఎంచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2022-09-29T00:11:32+05:30 IST

తిరువనంతపురం: భారత్ - దక్షిణాఫ్రికా 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆరంభమైంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ పడింది.

indiaVsSouthafrica: టాస్ గెలిచిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ ఏం ఎంచుకున్నాడంటే..

తిరువనంతపురం: భారత్ - దక్షిణాఫ్రికా (india Vs South africa) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభమైంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వరల్డ్ కప్‌కు ముందు చివరి సిరీస్ కావడంతో కీలక ఆటగాళ్లు హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతినిచ్చామని, వారి స్థానాల్లో  రిషత్ పంత్, అర్షదీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకున్నామని రోహిత్ చెప్పాడు. తిరువనంపురం పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ అని రోహిత్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌కు ముందు ఇది తమకు చాలా ముఖ్యమైన సిరీస్ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా చెప్పాడు. కీలకమైన ఈ మ్యాచ్ టాస్ గెలిచుంటే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు.


తుది జట్లు..

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్.


దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసో, ఐడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, త్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కసిగో రబాడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షాంమ్సీ.

Updated Date - 2022-09-29T00:11:32+05:30 IST