ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు ఎల్‌సీహెచ్‌ల అప్పగింత

ABN , First Publish Date - 2021-11-20T18:05:32+05:30 IST

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) రూపొందించిన లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌)లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అధికారికంగా

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు ఎల్‌సీహెచ్‌ల అప్పగింత

              - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హెచ్‌ఏఎల్‌ 


బెంగళూరు: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) రూపొందించిన లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌)లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అధికారికంగా అప్పగించారు. భారత స్వాతంత్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో రాష్ర్టీయ రక్ష సమర్పణ్‌ పర్వ్‌లో భాగంగా ఝాన్సీలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ ఎల్‌సీహెచ్‌లను ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌రామ్‌ చౌదరి సాంకేతికంగా అందుకున్నారు. ఈ హెలికాప్టర్లు ఎయిర్‌ఫోర్స్‌ కార్యకలాపాలకు వినియోగిస్తామన్నారు. అటాక్‌ హెలికాప్టర్లుగా గుర్తింపు పొందిన ఈ హెలికాప్టర్లు 5 వేల మీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను సాధించే సామర్థ్యం కలిగి వున్నాయి. ఇండియన్‌ ఎయిర్స్‌ కోసం 15 హెలికాప్టర్లను ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని, వీటిలో మూడింటిని అప్పగిస్తున్నట్లు హెచ్‌ఏఎల్‌ నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రక్షణ విభాగాల కోసం మొత్తం 145 ఎల్‌సీహెచ్‌లను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకొనే సామర్థ్యాన్ని ఈ ఫైటర్‌ హెలికాప్టర్లు కలిగివుంటాయని వెల్లడించింది. 

Updated Date - 2021-11-20T18:05:32+05:30 IST