ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో తెలుగోడి కీలక పాత్ర

ABN , First Publish Date - 2022-06-29T00:16:31+05:30 IST

రత-ఐరోపా సంబంధాలలో కీలకఘట్టమైన ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన విజయవంతం కావడంలో తెలుగువాడయిన దౌత్యవేత్త పర్వతనేని హారిష్ ప్రముఖ పాత్రవహించారు.

ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో తెలుగోడి కీలక పాత్ర
ప్రధాని నరేంద్ర మోదీకు జర్మనీలో స్వాగతం పలికిన రాయబారి హరీష్, నందిత దంపతులు

ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన

భారత-జర్మనీ సంబంధాలలో తెలుగుతేజం పాత్ర

రాయబారి పర్వతనేని హరీష్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారత-ఐరోపా సంబంధాలలో కీలకఘట్టమైన ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన విజయవంతం కావడంలో తెలుగువాడయిన దౌత్యవేత్త పర్వతనేని హారిష్ ప్రముఖ పాత్రవహించారు. జర్మనీలో గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం, ఓలాఫ్ షోల్స్ నేతృత్వంలో ఏర్పడ్డ నూతన సంకీర్ణ ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి భారతదేశం ప్రాధ్యానత ఇచ్చింది. ఈ క్రమంలో సీనియర్ దౌత్యవేత్త హరీష్‌ జర్మనీలో భారత రాయబారిగా నియమితులయ్యారు. గత సంవత్సరం నవంబర్‌లో రాయబారి భాద్యతలు స్వీకరించిన వెంటనే ఆయన జర్మనీతో వ్యూహాత్మక సంబంధాలను పటిష్ఠం చేసేందుకు కార్యరంగంలోకి దిగారు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో జి-7 శిఖరాగ్ర సదస్సులో అతిథిగా పాల్గోంటున్నారు.


భారతదేశానికి ఐరోపాలో కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్నజర్మనీ భారత్‌లో 13.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ప్రత్యేకించి మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో జర్మనీ మొదటి నుండి పెట్టింది పేరు కాగా స్వతహాగా మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడయిన హరీష్ పాత్ర ఇరు దేశాల సంబంధాలలో బలోపేతం చేశారు. రష్యా – ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జర్మనీ అగ్ని పరిక్షను ఎదుర్కోంటుంది. తన ఇంధన అవసరాల కోసం రష్యాపై అధికంగా ఆధారపడ్డ జర్మనీ, భారత్‌కు ఐరోపా సమాజంలో వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన దేశం. 


విజయవాడకు చెందిన హరీష్ గతంలో సౌదీ అరేబియా, ఈజిప్టు, పాలస్తీనా, అమెరికా దేశాల్లో పని చేసారు. కరోనా సంక్షోభంలో విదేశాలలో ఉంటున్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సమన్వయకర్తగా కూడా వ్యవహారించారు. హారిష్-నందిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు –ఆయూషీ, అమానీ. ఇక అమానీ పేరొందిన కూచిపూడి కళాకారిణి కూడా.



Updated Date - 2022-06-29T00:16:31+05:30 IST