దేశం విడిచి పారిపోతూ.. అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు!

ABN , First Publish Date - 2020-10-17T01:10:12+05:30 IST

క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఇండియన్-అమెరికన్.. దేశం విడిచి పారిపోతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన చికాగోలో చోటు చేసు

దేశం విడిచి పారిపోతూ.. అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు!

చికాగో: క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఇండియన్-అమెరికన్.. దేశం విడిచి  పారిపోతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన చికాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత సంసతికి చెందిన దురైకందన్ మురుగన్ (41) కొద్దిరోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు క్రిమినల్  కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ పాస్‌పోర్ట్‌తో దేశం విడిచి పారిపోయేందుకు మురుగన్ ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారమే లగేజ్ సర్దుకుని చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే మురుగన్ వ్యవహారశైలి.. సీబీపీ(కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్) అధికారులకు అతనిపై అనుమానం కలిగించింది. దీంతో అధికారులు మొబైల్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను నిర్వహించారు. దాంతో మురుగన్ బండారం బయపడింది. పాస్‌పోర్ట్ మురుగన్‌ది కాదని, అతనిపై క్రిమినల్ కేసు  పెండింగ్‌లో ఉందనే విషయాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు మురుగన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. 


Updated Date - 2020-10-17T01:10:12+05:30 IST