ఆ విషయంలో ఈ ఎన్నికలు ట్రంప్‌ను స్పష్టంగా తిరస్కరించాయి: రో ఖన్నా

ABN , First Publish Date - 2020-11-17T15:18:16+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఐదు కీలక రాష్ట్రాలతో పాటు పాపులర్ ఓట్లలో కూడా ఆధిక్యతను ప్రదర్శించడం అమెరికాకు పెద్ద విజయం మాత్రమే కాదు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనోఫోబియాను(ఇతర దేశాల ప్రజలపై పక్షపాతం) కుడా ఈ ఎన్నికలు స్పష్టంగా తిరస్కరించాయని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు.

ఆ విషయంలో ఈ ఎన్నికలు ట్రంప్‌ను స్పష్టంగా తిరస్కరించాయి: రో ఖన్నా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఐదు కీలక రాష్ట్రాలతో పాటు పాపులర్ ఓట్లలో కూడా ఆధిక్యతను ప్రదర్శించడం అమెరికాకు పెద్ద విజయం మాత్రమే కాదు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనోఫోబియాను(ఇతర దేశాల ప్రజలపై పక్షపాతం) కుడా ఈ ఎన్నికలు స్పష్టంగా తిరస్కరించాయని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 44 ఏళ్ల రో ఖన్నా వరుసగా మూడోసారి యూఎస్ ప్రతినిధుల సభ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాజాగా ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రెసిడెంట్‌గా ఎన్నికైన బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ పరిపాలన పెద్ద విజయాన్ని సాధించబోతోందని ఖన్నా జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికన్లు, డెమొక్రట్స్‌కు అతి పెద్ద విజయం దక్కిందని చెప్పిన ఆయన... ఐదు కీలక రాష్ట్రాలను బైడెన్ తనవైపు తిప్పుకోవడం కూడా గ్రేట్ అచీవ్‌మెంట్ అని అన్నారు. 


2008లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పొందిన పాపులర్ ఓట్ల కంటే కూడా బైడెన్‌కు అధికంగా ఓట్లు పోలయ్యాయని ఖన్నా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌కు 73.1 మిలియన్ ఓట్లు పోలైతే.. బైడెన్‌ 78.6 మిలియన్ ఓట్లు పొందారు. అదే ఒబామాకు 2008 ఎన్నికల్లో 69 మిలియన్ పాపులర్ ఓట్లు పడ్డాయని అన్నారు. కాగా, మొత్తం 50 రాష్ట్రాల నుండి వచ్చిన ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల తాజా లెక్క ప్రకారం 538 ఎలక్టోరల్ ఓట్లలో బిడెన్ 306 ఓట్లు కైవసం చేసుకున్నారు. ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ సులువుగా అందుకున్నట్లైంది. ఇక స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో మొదట ఆధిక్యం ప్రదర్శించిన ట్రంప్‌ను వెనక్కి నెట్టి బైడెన్ విజయం సాధించడం ఈ ఎన్నికల్లో కీలక మలుపు అని ఖన్నా పేర్కొన్నారు.      

Updated Date - 2020-11-17T15:18:16+05:30 IST