America లో ఇన్‌సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టి దిమ్మతిరిగే షాకిచ్చిన భారతీయ అమెరికన్.. కోర్టు విధించిన శిక్ష ఏంటంటే..

Sep 19 2021 @ 02:09AM

వాషింగ్టన్: అమెరికా అధికారులకు ఓ భారతీయ అమెరికన్ భారీ షాకిచ్చాడు. కోట్లు కొల్లగొట్టి దిమ్మతిరిగేలా చేశాడు. దాదాపు 7 ఏళ్ల క్రితమే ఈ మోసానికి అతడు బీజం వేశాడు. అయితే కొన్నేళ్లకు అధికారులకు దీనిపై అనుమానం రావడంతో సదరు భారతీయ అమెరిన్‌ను అరెస్టు చేశారు. తాజాగా కోర్టులో నిందితుడు తన తప్పును ఒప్పుకోవడంతో న్యాయమూర్తి అతడికి భారీ జైలు శిక్ష విధించాడు.

వివరాల్లోకి వెళితే.. దయాకర్ మల్లు(51) గ్లోబల్ ఆపరేషన్స్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీస్‌ ఆఫ్ మైలాన్‌ సంస్థలో 2017-19 మధ్య వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. అదే సమయంలో అతడికి మరో ఎగ్జిక్యూటివ్ కూడా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి సంస్థకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు అందజేసేవాడు. అలా సమాచారం అందుకున్న వ్యక్తులు మైలాన్ సంస్థ తమ నిర్ణయాలను ప్రకటించక ముందే వాటి గురించి తెలుసుకుని ఆ సంస్థ సెక్యురిటీస్‌లో భారీ పెట్టుబడులు పెట్టేవారు. సంస్థ తమ నిర్ణయాలను ప్రకటించిన తరువాత ఆ కంపెనీ స్టాక్ సెక్యురిటీల ధర భారీగా పెరిగేది.

మల్లు చేసిన నిర్వాకం వల్ల దాదాపు 8 మిలియన్ డాలర్లు(రూ.59 కోట్లు) మోసం చేసినట్లు తేలింది. అతడి ట్రేడింగ్ ఖాతాలో ఈ మొత్తానికి సంబంధించిన సరైన లెక్కలు లేకపోవడంతో మల్లును అనుమానించిన అధికారులు అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే అతడిని దోషిగా తేలుస్తూ కోర్టు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే 25ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు కూడా పేర్కొంది. 

ఇది మాత్రమే కాకుండా ట్యాక్స్ కట్టే సాధారణ ప్రజల విషయంలో కూడా మల్లు పూర్తిగా తప్పుదారి పట్టించి తన కంపెనీకి దాదాపు 1.3 లక్షల డాలర్లు( రూ.9 కోట్లకు పైగా) సొమ్మును తన కంపెనీ లెక్కల్లో తప్పుగా తేల్చినట్లు తేలింది. దీనికి మరో 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంటే మొత్తం 28ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.