మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్‌

ABN , First Publish Date - 2021-07-10T13:45:16+05:30 IST

మరో భారత అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు.

మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్‌

అమెరికా మెడికేర్‌ డైరెక్టర్‌గా మీనా శేషమణి

వాషింగ్టన్: మరో భారత అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం, మానవ సేవల సంస్థ(హెచ్‌హెచ్‌ఎస్‌) సమీక్ష బృందం సభ్యురాలిగా బైడెన్‌-హారి్‌సకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిన ఆరోగ్య నిపుణురాలు డాక్టర్‌ మీనా శేషమణి యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ మెడికేర్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న శేషమణి.. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నుంచి ఎండీ పూర్తిచేశారు.

Updated Date - 2021-07-10T13:45:16+05:30 IST